Jagapatibabu : జగపతిబాబు ఈ స్థాయిలో ఉండటానికి బాలయ్యే కారణమా.. అటు రెమ్యునరేషన్ ఇటు ఇమేజ్ మార్చేయడంతో?

ఒకప్పుడు కుటుంబ కథా సినిమాలలో నటించి ప్రేక్షకులను ఊహించని స్థాయిలో ఆకట్టుకున్న హీరోలలో జగపతిబాబు( Jagapathi Babu ) ఒకరు.హీరోగా అవకాశాలు తగ్గిన తర్వాత జగపతిబాబు లెజెండ్ సినిమాతో ( Legend movie )విలన్ గా మారారు.

 Balakrishna Is The Reason For Jagapatibabu Life Charnge Details Here Goes Viral-TeluguStop.com

ఈ సినిమాతో జగపతిబాబు ఇమేజ్ మారిందనే సంగతి తెలిసిందే.ఈ సినిమాతో జగపతిబాబు రెమ్యునరేషన్ తో పాటు ఇమేజ్ మారింది.

నేడు జగపతిబాబు పుట్టినరోజు అనే సంగతి తెలిసిందే.

గతంలో వేర్వేరు సందర్భాల్లో జగపతిబాబు చెప్పిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి.

ఒకే తరహా పాత్రలలో నటించడం ఇష్టపడని హీరోలలో జగపతిబాబు ఒకరు.నేను హీరోను.హీరో తరహా పాత్రలే చేస్తా.ఇతర పాత్రలు పోషించను అని భావిస్తే జైలులో ఉన్నట్లే అనిపిస్తుందని జగపతిబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు.

హీరో రోల్స్ కు జగపతిబాబు గుడ్ బై చెప్పిన తర్వాత మంచి రోల్స్ కోసం ఎదురుచూశారు.

Telugu Balakrishna, Jagapatibabu, Legend-Movie

సినిమా ఆఫర్లు రాకపోవడంతో జగపతిబాబు కొంతకాలం ఖాళీగా ఉండగా ఆ సమయంలో కొంతమంది జగపతిబాబును చిన్నచూపు చూశారట.ఆ తర్వాత లెజెండ్ స్క్రిప్ట్ నచ్చడంతో ఈ సినిమాకు జగపతిబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది.ఆ సమయంలో నాకు రెట్టింపు పారితోషికం దక్కిందని జగపతిబాబు వెల్లడించారు.

ప్రస్తుతం జగపతిబాబుకు వరుసగా సినీ ఆఫర్లు వస్తున్నాయి.

Telugu Balakrishna, Jagapatibabu, Legend-Movie

మాస్ రోల్స్ తో పాటు క్లాస్ రోల్స్ లో నటిస్తూ జగపతిబాబు సత్తా చాటుతున్నారు.రోజుకు 8 నుంచి 10 లక్షల రూపాయల రేంజ్ లో ఆయన రెమ్యునరేషన్ అందుకుంటున్నారు.జగపతిబాబు నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ లతో భవిష్యత్తులో మరిన్ని విజయాలను సొంతం చేసుకుంటాయేమో చూడాల్సి ఉంది.

ప్రస్తుతం జగపతిబాబుకు దక్కిన ఈ గుర్తింపుకు ఒక విధంగా బాలయ్య కారణమని చెప్పవచ్చు.జగపతిబాబు యాక్టింగ్ స్కిల్స్ కు ఎంతోమంది ఫిదా అవుతుండటం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube