Paratha Flipping : అత్తలాగా పెనం మీద పరాఠా తిప్పుదామనుకున్న కోడలు.. తర్వాతేమైందో చూస్తే..

భారతదేశంలో పరాఠా( Paratha ) అనేది చాలా పాపులర్ అయిన టిఫిన్ అని చెప్పుకోవచ్చు.వీటిని వివిధ రకాల పిండి, స్టఫ్‌తో ప్రజలు తయారు చేసుకుంటుంటారు.

 Woman Tries To Flip Paranthas Like Mother In Law But Failed Funny Video Viral-TeluguStop.com

ఇవి మంచిగా రావాలంటే కాస్త ప్రాక్టీస్ ఉండాలి.అలానే వాటిని ఎలా తయారు చేయాలో, పెనం మీద ఎలా కాల్చాలో తెలుసుకోవాలి.

తాజాగా ఓ యువతి తన అత్తగారి దగ్గర పరాఠాలు ఎలా పెనం మీద( Pan ) తిప్పాలో నేర్చుకునేందుకు ప్రయత్నించింది.కానీ ఆ ప్రయత్నంలో అత్తకి ఊహించని షాక్ ఇచ్చింది.

ఈ ఫన్నీ ఘటనకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.

‘నేను మా అత్తగారి( Mother-In-Law ) దగ్గర వంట నేర్చుకునేందుకు ప్రయత్నించినప్పుడు ఇలా జరిగింది.’ అనే క్యాప్షన్‌తో ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.ఈ వీడియో ఓపెన్ చేస్తే, అత్త ఓ వేడి పాన్‌పై పరాఠాను రివర్స్ గా తిప్పేయడం మనం చూడవచ్చు.

ఆ సమయంలో ఆమె తన కోడలుకు సులభంగా రొట్టెను ఎలా తిప్పాలో చూపిస్తుంది, కోడలు ఈ ట్రిక్ పట్ల శ్రద్ధ చూపించింది.తరువాత అదే పని చేయడానికి ప్రయత్నించింది, కానీ విఫలమైంది.

వేడిగా ఉన్న పరాఠాను పెనంలో పడేటట్టు ఆమె విసరలేదు.ఆమె పెనాన్ని కాస్త వేగంగా పైకి లేపడంతో పరాఠా వచ్చి అత్త చేతుల్లో పడింది.

వేడివేడి రొట్టె చేతిలో పడడంతో అత్త ఆ నొప్పిని భరించలేక లబోదిబోమని ఏడ్చేసింది.

ఇది చూసిన కోడలు( Daughter-In-Law ) అత్త తిడుతుంది ఏమో అని భయపడి వంటగదిలోంచి పారిపోయింది.కొద్దిసేపటికి కొడుకు వంటగదిలోకి వచ్చి ఏమైందని అడిగాడు.బాధతో ఉన్న అతని తల్లి ఏమీ మాట్లాడకుండా అతని ముఖం మీద గట్టిగా కొట్టింది.

కొడుకు కంగారుపడి, “నేనేం చేసాను?” అని బాధపడుతూ అడిగాడు.ఈ వీడియోను 29.4 మిలియన్లకు పైగా ప్రజలు వీక్షించారు, ఈ వీడియో చూసి కోడలు చేసిన తప్పుకి కొడుకే బలైయ్యాడు అని సరదాగా కామెంట్లు పెడుతున్నారు.ఈ ఫన్నీ వీడియోను మీరు కూడా చూడండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube