మధ్యప్రదేశ్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ( Narendra Modi ) పర్యటన కొనసాగుతోంది.జాబువాలో ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.తాము ప్రజల కోసం 24 గంటలు కష్టపడతామని చెప్పారు.2024 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి 400 సీట్లు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
ఇందులో బీజేపీ( BJP ) సింగిల్ గా 370 స్థానాలు సాధిస్తుందని తెలిపారు.అలాగే ప్రస్తుతం మధ్యప్రదేశ్ దుస్థితికి కాంగ్రెస్ పార్టీనే( Congress party ) కారణమని మోదీ ఆరోపించారు.గిరిజనులను కాంగ్రెస్ ఓటు బ్యాంకులాగానే వాడుకుందని విమర్శించారు.