Pawan Kalyan : జనంలోకి పవన్ .. రూట్ మ్యాప్ ఈ విధంగా 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని స్పీడ్ పెంచుతున్నారు.ఇప్పటి వరకు పొత్తులు , సీట్ల సర్దుబాటు వ్యవహారంపై దృష్టి పెట్టిన పవన్, ఇక జనాల్లోకి వెళ్లి ప్రజాబలం పెంచుకునే ప్రయత్నాలు మొదలు పెట్టేందుకు సిద్ధం అవుతున్నారు.

 Pawan Kalyan : జనంలోకి పవన్ .. రూట్ మ్యా-TeluguStop.com

బిజెపి( BJP ) తమతో కలిసి వస్తే సరే, లేకపోతే టిడిపి తోనే కలిసి సీట్లు సర్దుబాటు చేసుకుని వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీని ఓడించాలనే పట్టుదలతో పవన్ ఉన్నారు.దీనిలో భాగంగానే జనాల్లోకి వెళ్ళేందుకు రూట్ మ్యాప్ ను సిద్ధం చేసుకున్నారు.

మూడు దశల్లో ఎన్నికల కార్యాచరణకు పవన్ సిద్ధమవుతున్నారు .మొదటి దశలో పొత్తుకు పార్టీ క్యాడర్ ను సిద్ధం చేయడం, రెండో దశలో పార్టీ ఎన్నికల వ్యూహంపై కేడర్ కు దిశా నిర్దేశం చేయడం, మూడో దశలో ప్రచార సభలో పాల్గొంటూ .కేడర్ ను పూర్తిగా ఎన్నికల మూడ్ లోకి తీసుకు వెళ్లడం చేయాలని పవన్ నిర్ణయించుకున్నారు .వీటితో పాటు మూడు దశల్లో పర్యటనలు చేపట్టేందుకు పవన్ ప్లాన్ చేసుకుంటున్నారు.మొదటి దశలో జనసేన టిడిపి( Janasena ,TDP ) కేడర్ ను సమన్వయం చేయడం, రెండో దశలో ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కేడర్ కు దిశా నిర్దేశం చేయడం, మూడో దశలో ఎన్నికల ప్రచారాలు నిర్వహించడం పైన దృష్టి పెట్టమన్నారు.

Telugu Ap, Janasena, Janasenani, Pawan Kalyan, Tdpjanasena, Telugudesam, Ysrcp-P

రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి నియోజకవర్గాల వారీగా వరుసగా సమావేశాలు, సభలు నిర్వహించాలని నిర్ణయించుకున్నారు.పవన్ కార్యాచరణను ఉభయగోదావరి జిల్లాల నుంచి ప్రారంభించనున్నారు.రెండు పార్టీల అధినేతలు క్షేత్రస్థాయిలో కలిసి వెళ్లే విధంగా పవన్ కళ్యాణ్ వ్యవహారచన చేశారు.

ఇప్పటికే సీట్ల సర్దుబాటు విషయంలో కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో వివాదాలు తలెత్తడం వంటి వాటి పైన దృష్టి సారించనున్నారు.ముఖ్యంగా జనసేన పార్టీ( Janasena ) నేతలతో భేటీ అయి, పార్టీ కేడర్ మధ్య ఎటువంటి గ్రూపులు లేకుండా టిడిపి తో కలిసి ముందుకు వెళ్లే విషయంపై పవన్ సూచనలు చేయనున్నారు.

ఈనెల 14 నుంచి 17 వరకు ఉభయగోదావరి జిల్లాలో పవన్ పర్యటిస్తారు.మొదట భీమవరం తరువాత అమలాపురం, కాకినాడ ,రాజమండ్రి లో పవన్ పర్యటన ఉంటుంది.

Telugu Ap, Janasena, Janasenani, Pawan Kalyan, Tdpjanasena, Telugudesam, Ysrcp-P

రెండో దశ పర్యటనలో పార్టీ ముఖ్య నేతలు, వీర మహిళలు పోటీ చేసే నియోజకవర్గాల పరిధిలో పవన్ కళ్యాణ్ పర్యటన ఉండబోతోంది.టిడిపితో కలిసి వెళ్లే అంశం, పొత్తుల విషయం పైన టిడిపి తో అనుసరించాల్సిన వ్యూహం పైన పార్టీ నేతలకు క్లారిటీ ఇవ్వనున్నారు.ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత కూడా ఇదే వ్యూహాన్ని అనుసరించే విధంగా పార్టీ నేతలను సిద్ధం చేయనున్నారు.మూడో దశ పర్యటనలో పూర్తిగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.

టిడిపి అధినేత చంద్రబాబుతో పాటు, పవన్ సైతం అనేక కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా ప్లాన్ చేశారు .తాను పాల్గొనే సభలు, సమావేశాల్లోనే టిడిపి కీలక నేతలు అందరినీ ఆహ్వానించాలని పవన్ నిర్ణయించుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube