సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

రాజన్న సిరిసిల్ల జిల్లా:సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరు కూడా మీ ప్రమేయం లేకుండా వచ్చిన ఓటీపీ నెంబర్ ఇతరులకు చెప్పవద్దని,ఇతర బ్యాంకు వివరాలు చెప్పవద్దని, ఆన్లైన్లో కస్టమర్ కేర్ నెంబర్లు సెర్చ్ చేయవద్దని ,ప్రజలు ఎవరైనా సైబర్ నేరానికి గురైతే వెంటనే ట్రోల్ ఫ్రీ నెంబర్ 1930 కి కాల్ చేయాలని జిల్లా ఎస్పీ సుచించారు.

 People Should Be Alert To Cyber Criminals., Rajanna Sirisilla District, Sp Akhil-TeluguStop.com

ఈక్రింది విధంగా సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి వీటిపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలి.

1.బిజినెస్ మరియు ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ (పెట్టుబడి మరియు వ్యాపార మోసం)

గుర్తు తెలియని సైబర్ నేరగాడు సోషల్ మీడియా( Social media )లో ఏదో ఒక లింక్ పెట్టి అది ఓపెన్ చేసిన సదరు బాధితుడిని టెలిగ్రామ్ గ్రూప్ లో యాడ్ చేసిఇందులో ఇన్వెస్ట్ చేస్తే పెద్ద మొత్తంలో లాభాలు వస్తాయని ఆశ చూపి మోసం చేయడం.

2 లోన్ ఫ్రాడ్ (రుణం ఇస్తామని మోసం)

గుర్తు తెలియని సైబర్ నేరగాడు సోషల్ మీడియాలో ఏదో ఒక లింక్ పెట్టి అది ఓపెన్ చేసిన సదరు బాధితుడిని నమ్మించి ఓటీపీ మెయిల్ అడ్రస్ బ్యాంకు వివరాలు వారి ఆధీనంలోకి తీసుకొని 3000, 4000,10000 రూపాయల వరకు రుణం ఇచ్చి మొత్తం డబ్బులు కట్టిన తర్వాత కూడా మళ్లీ డబ్బులు రావాలని లేదంటే కేసు వేస్తామని బెదిరిస్తూ ఫోటోలు మార్పు చేసి సోషల్ మీడియాలో పడుతామంటు బెదిరిస్తూ డబ్బులు గుంజేస్తారు ప్రజలు జాగ్రత్తగా ఉండాలి.

3.ఫేక్ కస్టమర్ కేర్ సర్వీస్ ఫ్రాడ్

(నకిలీ వినియోగదారుల సర్వీస్ మోసం) కొంతమంది బాధితులు గూగుల్లో ఆన్లైన్ నెంబర్ ల గురించి సర్చ్ చేసేటప్పుడు అందులో ఉన్న ఏదో ఒక నెంబర్ కు ఫోన్ చేసి కస్టమర్ కేర్ సెంటర్ అని అడగగానే అవును అని సదరు బాధితుల్ని మభ్యపెట్టి ఆ సమస్యను బట్టి అతను మొబైల్ కి ఒక లింకు పంపించగానే లింకు ఓపెన్ చేసిన బాధితుడు ఓటిపి తదితర వివరాలు నింపగానే అందులో డబ్బులు పంపించిన తర్వాత సైబర్ నేరగాళ్లు మోసం చేస్తారు జాగ్రత్త.

4 డెలివరీ బాయ్ స్కామ్

మీరు ఆర్డర్ చేయకుండానే మీరు ఆన్లైన్లో ఆర్డర్ వచ్చిందని డెలివరీ బాయ్ (Delivery boy )మీ ఇంటికి వస్తే కచ్చితంగా సైబర్ నేరమని గమనించండి డెలివరీ బాయ్ వచ్చి ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితులలో ఓటీపీ నెంబర్ చెప్పవద్దు మీకు తెలియకుండా ఎలాంటి ఆర్డరు రాదు కాబట్టి దీనిని కచ్చితంగా మోసమని గ్రహించండి సైబర్ మోసాలకు ఒక్క అడుగు దూరంగా ఉండండి.

5.జాబ్ ఫ్రాడ్స్ ( ఉద్యోగం ఇస్తామని మోసం)

గుర్తుతెలియని సైబర్ నేరగాడు కొంతమంది ఫోన్లలకు ఒక లింకు పంపిస్తాడు అది ఓపెన్ చేయగానే ప్రైవేట్ జాబ్స్ ఉన్నాయి మంచి జీవితం వస్తుందని అందులో ఒక మెసేజ్ ఉంటుంది గుర్తుతెలియని సదరు బాధితులు ఆ మెసేజ్ ఓపెన్ చేయగానే పార్ట్ టైం జాబ్స్ ఉన్నాయి మీ రెజ్యూమ్ మరియు ఇతర వివరాలు నింపమనగానే నింపవద్దు నింపిన తరువాత టెలిగ్రామ్ యాప్ కు యాడ్ చేసి ఇందులో మంచి మంచి ఆఫర్స్ కంపెనీలు ఉన్నాయి పెట్టుబడి పెడితే ఎక్కువ మొత్తంలో లాభాలు వస్తాయని చెప్తాడు సైబర్ మోసగాడు మాటలు విని డబ్బులు పెట్టి మోసపోవద్దు సుమ.జాగ్రత్తగా ఉండాలి.

6.కొరియర్స్ స్కామ్

ఏదో ఒక కంపెనీ నుంచి ఫోన్ కాల్ వస్తుంది మీ పేరిట పార్సల్ వచ్చిందని అందులో ప్రభుత్వం నిషేధించిన పదార్థాలు ఉన్నాయని ఫోన్ చేసి బెదిరిస్తాడు ఈ లోగా మరొక వ్యక్తి లైన్ లోకి వచ్చి ముంబై నార్కోటిక్ డివిజన్ అధికారులమని ఐడెంట్లీ వెరిఫికేషన్ చేయవలసి ఉంటుందని నమ్మిస్తారు అలా నమ్మించి స్టేట్మెంట్ ప్రూఫ్ చూపించి వెరిఫికేషన్ కోసం కొంత డబ్బులు పంపించాలని డిమాండ్ చేస్తారు పంపించిన డబ్బులు రిఫండ్ అయితే అంటారు.ఇలాంటి కాల్స్ వస్తే ప్రజలు ఎవ్వరూ భయపడవద్దు ఇది సైబర్ నేరమని గమనించి జాగ్రత్తగా ఉండాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube