సిద్దిపేటకు( Siddipet ) చెందిన ఒక యువకుడు పొలంలోనే వడ్లను బియ్యం గా మార్చే హార్వెస్టర్( Harvester ) ఆవిష్కరణ చేశాడు.ఇప్పటివరకు మనం పొలంలో వడ్లను సేకరించే హార్వెస్టర్ లను మాత్రమే చూశాం.
ఇక వడ్లను బియ్యం గా మార్చాలంటే.వడ్లను ఖచ్చితంగా రైస్ మిల్లకు తరలించాల్సిందే.
ఒకవేళ వడ్లను పొలంలోనే బియ్యంగా మార్చే అవకాశం ఉంటే.రైతుకు డబ్బుతో పాటు శ్రమ కూడా చాలా ఆదా అవుతుంది.
సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం పెద్ద కోడూరు గ్రామానికి చెందిన అమరేందర్( Amarender ) అనే ఒక యువకుడు దాదాపుగా ఒక సంవత్సరన్నర కాలం కష్టపడి టూ ఇన్ వన్ హార్వెస్టర్ ను( Two-In-One Harvester ) తయారు చేశాడు.ఈ హార్వెస్టర్ పొలంలో ముందుగా వడ్లు కోసి, ఆ తర్వాత వెంటనే వడ్లను బియ్యం గా మార్చేస్తుంది.అమరేందర్ కి ఈ హార్వెస్టర్ తయారీ కోసం రూ.30 వేలు ఖర్చు అయ్యింది.

అమరేందర్ చేసిన ఈ చిన్న ప్రయోగం విజయవంతంగా సక్సెస్ అయ్యింది.ఈ హార్వెస్టర్ వడ్లను కోసి వాటిని బియ్యం గా( Rice ) మార్చేసింది.పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేసి, పెద్ద హార్వెస్టర్ తయారు చేస్తే రైతులకు( Farmers ) ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.వడ్లను రైస్ మిల్లకు తరలించడం కోసం ఆటో కిరాయిలు, ట్రాక్టర్ కిరాయిల అవసరం ఉండదు.

ఈ హార్వెస్టర్ ద్వారా పొలంలోనే వడ్లను బియ్యం గా మార్చేసుకుని ఇంటికి తరలించవచ్చు.పొలంలో తేమ లేకుండా పంట మొత్తం బాగా ఆరిన తర్వాత ఈ హార్వెస్టర్ సహాయంతో పంట నూర్పిడి చేయాలి.ఇలా టూ ఇన్ వన్ హార్వెస్టర్ ను తయారుచేసిన అమరేందర్ ను సిద్దిపేట వాసులు అభినందిస్తున్నారు.







