ప్రస్తుత కాలంలో భర్త సపోర్ట్ లేకుండా కూతుళ్లను పెంచి పోషించి ప్రయోజకులను చేయడం సులువైన విషయం కాదనే సంగతి తెలిసిందే.అయితే ఒక మహిళ మాత్రం ఎంతో కష్టపడి తన పిల్లలు కెరీర్ పరంగా ఎదగడానికి తన వంతు సహాయ సహకారాలను అందించారు.
ఏపీలోని శృంగవరపుకోటకు చెందిన మాచిట్లి బంగారమ్మకు ముగ్గురు ఆడపిల్లలు కాగా ముగ్గురూ కూతుళ్లే పుట్టడంతో భర్త ఆమెను విడిచిపెట్టాడు.
అయితే భర్త సపోర్ట్ లేకపోయినా ఆమె మాత్రం కృంగిపోలేదు.
కష్టాన్ని నమ్ముకుని భవన నిర్మాణ కార్మికురాలిగా( Construction Worker ) మారిన ఆమె వచ్చిన కూలి డబ్బులతో పిల్లలను పోషించారు.ముగ్గురు కూతుళ్లను( Three Daughters ) ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి చదివించగా ఆ ముగ్గురు పిల్లలు చదువులో రాణించడం గమనార్హం.
ఆర్థిక ఇబ్బందులు ఎదురైన సమయంలో కొంతమంది దాతలు ఈ కుటుంబానికి సహాయసహకారాలు అందించారు.

కూతుళ్లలో ఇద్దరు కూతుళ్లు ప్రభుత్వ ఉద్యోగాలు( Govt Jobs ) చేస్తుండగా మరో కూతురు పీహెచ్డీ చేస్తున్నారని తెలుస్తోంది.ముగ్గురు కూతుళ్ల పేర్లు సరస్వతి,( Saraswati ) రేవతి,( Revathi ) పావని( Pavani ) కాగా సరస్వతి ఏలూరులో సచివాలయ ఉద్యోగిగా పని చేస్తున్నారు.రెండో కూతురు రేవతి ప్రస్తుతం ఆర్.డబ్ల్యూ.ఎస్ ఏఈఈగా పని చేస్తుండటం గమనార్హం.
పిల్లలు సాధిస్తున్న విజయాలు బంగారమ్మను( Bangaramma ) కన కష్టాన్ని మరిచిపోయేలా చేస్తున్నాయి.

బంగారమ్మ సక్సెస్ స్టోరీ నెటిజన్లను సైతం ఎంతగానో ఆకట్టుకునేలా ఉండటం గమనార్హం.రేయింబవళ్లు తీవ్రస్థాయిలో శ్రమించి ముగ్గురు పిల్లలను ప్రయోజకులను చేసిన ఆమెను ఎంత మెచ్చుకున్నా తక్కువేనని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.బంగారమ్మను ఎంత మెచ్చుకున్నా తక్కువేనని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
పీహెచ్డీ చేస్తున్న చిన్న కూతురు పావని సైతం రాబోయే రోజుల్లో మంచి ఉద్యోగం సాధించాలని నెటిజన్లు మనస్పూర్తిగా కోరుకుంటున్నారు.బంగారమ్మను నెటిజన్లు ఎంతగానో ప్రశంసిస్తుండగా ఆమెకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.







