Nagarjuna : ఏఎన్ఆర్‌ తనకు చేసినట్లు కుమారుల విషయంలో నాగార్జున చేయడం లేదా?

సినీ ఇండస్ట్రీలో హీరోగా నిలదొక్కుకోవడం అంటే మాటలు కాదు.ఎంత పెద్ద హీరో అయినా సరైన స్క్రిప్ట్‌లు ఎంచుకోవడం, సరైన సినిమాలు తీసి ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించడం ఈ రోజుల్లో చాలా కష్టం.

 Why Nagarjuna Is Not Taking Initiative For His Sons-TeluguStop.com

నాగార్జునకు మాత్రం ఈ విషయంలో ఏఎన్ఆర్ చాలా శ్రద్ధ తీసుకున్నారు.ఒకప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోగా ఏఎన్ఆర్( ANR ) ఉండే వారు.

అప్పట్లోనే ఎన్టీఆర్ పౌరాణిక సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకునే వారు.అయితే కుటుంబ కథా చిత్రాలు, ముఖ్యంగా విషాదాంత ప్రేమ కథల్లో ఏఎన్ఆర్ జీవించే వారు.

తనకు తగ్గ కథలను ఎంచుకుని, డ్యాన్స్‌లతో ప్రేక్షకులకు ఆరాధ్య హీరోగా ఏఎన్ఆర్ నిలిచారు.ఆ తర్వాత కెరీర్ తొలినాళ్లలో నాగార్జునకు అంత గుర్తింపు రావడంలో ఏఎన్ఆర్ ఎంతో శ్రద్ధ తీసుకున్నారు.

సినిమా స్క్రిప్టులు, డైరెక్టర్లు ఇతర వ్యవహారాలను దగ్గరుండి ఫైనల్ చేసే వారు.దీంతో నాగార్జున( Nagarjuna ) వరుస హిట్ సినిమాలతో తండ్రి కలలను నెరవేర్చడంలో సఫలీకృతుడయ్యాడు.

Telugu Akhil, Akkineni Heroes, Naga Chaitanya, Nagarjuna-Movie

గ్రీకువీరుడిగా అమ్మాయిల డ్రీమ్ హీరోగా ఆయన పేరొందాడు.ఆరు పదుల వయసులోనూ ఇప్పటికీ యంగ్‌గా, పూర్తి ఫిట్‌గా కనిపిస్తుంటారు.అయితే తన కుమారులు నాగచైతన్య, అఖిల్ విషయంలో మాత్రం ఆయన సరిగ్గా పట్టించుకోవడం లేదనే వాదన వినిపిస్తోంది.నాగచైతన్య, అఖిల్ ఇద్దరూ నాగార్జున కుమారులుగా ఇండస్ట్రీలో అడుగు పెట్టారు.

ఇప్పటికి ఎన్నో ఏళ్లు గడిచాయి.స్టార్ దర్శకులు( Star Directors ) సైతం వారితో సినిమాలు తీశారు.

అయితే ఇండస్ట్రీ హిట్ అనిపించే సినిమా మాత్రం వారి నుంచి రాలేదు.ఫీల్ గుడ్ మూవీలతో నాగచైతన్య పర్వాలేదనిపించాడు.

అయితే అఖిల్( Akhil ) మాత్రం ఇప్పటికీ స్ట్రగుల్ అవుతున్నాడు.మంచి దర్శకుడు, స్టార్ నటీనటులు, భారీ నిర్మాణ విలువలతో సినిమాలు తీసినా తొలి రోజు కూడా ప్రేక్షకులు థియేటర్లకు రాలేకపోతున్నారు.

Telugu Akhil, Akkineni Heroes, Naga Chaitanya, Nagarjuna-Movie

నాగచైతన్య( Naga Chaitanya ) కూడా ఏదో సోసో హీరోగా ప్రస్తుతం కొనసాగుతున్నాడు.అయితే ఇండస్ట్రీలో టాప్ హీరో అయిన నాగార్జున ఫేమ్‌కు తగ్గట్టు మాత్రం వారు పేరు సంపాదించ లేకపోతున్నారు.ఇందుకు కారణం మాత్రం నాగార్జున అని చాలా మంది భావిస్తున్నారు.తన కెరీర్ విషయంలో తండ్రి ఏఎన్ఆర్ ఎంత శ్రద్ధ పెట్టారో అందులో సగం కూడా తన కుమారులపై నాగార్జున పెట్టడం లేదని సినీ ప్రియులు భావిస్తున్నారు.

ఇక ముందైనా మంచి కథలు ఎంచుకోవడంలో, వైవిధ్యమైన స్టోరీలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఇద్దరు కుమారులకు సాయపడాలని నాగార్జునకు సూచిస్తున్నారు.కుమారుల విషయంలో మరింత శ్రద్ధ తీసుకుంటేనే వారు ఇండస్ట్రీలో తర్వాతి జనరేషన్‌కు స్టార్ హీరోలు అవుతారని విశ్లేషకులు భావిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube