Prisoners : ఇదేందయ్యా ఇది.. ఖైదీలతో డీజిల్ అయిపోయిన కారును కోర్టు దాకా తోయించిన పోలీసులు..

ఇటీవల కాలంలో పోలీసులు ఖైదీల పట్ల ప్రవర్తిస్తున్న తీరు చాలామంది షాకీ గురిచేస్తోంది.తాజాగా ఫ్యూయల్ లేని ఒక స్కార్పియో కారును ఖైదీలతో ముందుకు తోయించారు పోలీసులు.

 The Police Took The Diesel Car With The Prisoners To The Court-TeluguStop.com

దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.ఈ వీడియో చూసిన చాలామంది ఇది ఎక్కడ విడ్డూరం అని నోరెళ్ళ బెడుతున్నారు.

అసలు విషయంలోకి వెళ్తే ఫ్యూయల్ అయిపోయిన స్కార్పియో కారు మరెవరిదో కాదు అది ఒక పోలీస్ వెహికల్( Police vehicle ) ఇంకో ఆశ్చర్యకరమైన వార్త ఏంటంటే ఆ స్కార్పియో కారును తోసేది ఆ పోలీసులు పట్టుకున్న నేరస్థులే.ఈ వింత ఘటనను కొంతమంది వీడియో తీసి సోషల్ మీడియా లో షేర్ చేసారు.

Telugu Bihar, Vehicle, Prisoners, Scorpio, Scorpio Fuel, Uttar Pradesh-Latest Ne

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.బిహార్( Bihar ) లోని భాగల్పూర్ ప్రాంతంలో ఈ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళ్తే ఒక కేసులో నిందితులుగా ఉన్న కొంతమంది వ్యక్తులను కోర్టులో హాజరు పరిచేందుకు పోలీసులు తమ అధికారిక వాహనమైన మహీంద్రా స్కార్పియో( Mahindra Scorpio ) కారులో తీసుకెళ్తున్నారు.కొంతదూరం వెళ్ళగానే డీజిల్ అయిపోయి వాహనం మధ్యలోనే ఆగిపోయింది.

దాంతో ఖైదీలతో కోర్టు వరకు కారును తోయించారు పోలీసులు.అయితే వాహనం తోసే సమయంలో ఖైదీలు పారిపోయే అవకాశం ఉన్నా కూడా వాళ్ళు అలా చెయ్యలేదు.

Telugu Bihar, Vehicle, Prisoners, Scorpio, Scorpio Fuel, Uttar Pradesh-Latest Ne

ఇక ఈ వార్త ఉన్నత అధికారుల దృష్టికి చేరడంతో ఈ సంఘటనపై వారు విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో పై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.వాహనం దారి మధ్యలో ఆగిపోయినప్పుడు ట్రాఫిక్ కి అంతరాయం కలగకుండా ఆ వాహనాన్ని రోడ్డుకు ఒక పక్కకు పెట్టాలి అని కొంతమంది కామెంట్ చేస్తున్నారు.మరికొంతమందేమో ‘వాహనంలో డీజిల్ అయిపోయినప్పుడు దగ్గర్లో ఉన్న పెట్రోల్ బ్యాంకుకి పంపి డీజిల్ తెప్పించాలి కానీ ఖైదీలను( Prisoners ) అలా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు.

ఈ ఘటనపై ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోవాలి ‘ అని కామెంట్ చేస్తున్నారు.ఈ లింక్‌ https://youtu.be/hHFIni_3sg8?si=GARavbwFxdBTDq_q పై క్లిక్ చేసి వీడియోను చూడవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube