బాలీవుడ్ నటి పూనమ్ పాండే( Poonam Pandey )ఇటీవల వార్తలలో నిలిచిన సంగతి తెలిసిందే.ఈమె సోషల్ మీడియా ద్వారా తాను చనిపోయాను అంటూ పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
తన వయసు 32 సంవత్సరాల వయసులోనే తాను గర్భాశయ క్యాన్సర్( Cervical Cancer ) బారిన పడి సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.ఈ పోస్ట్ చూసినటువంటి ఎంతోమంది అభిమానులు సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా ఈమెకు నివాళులు అర్పిస్తూ పోస్ట్ లు చేశారు.
ఇలా ఈమె సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున పాపులర్ అయ్యారు.ఇలా తన గురించి సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నటువంటి తరుణంలో ఈమె ఈ వార్తలపై స్పందించి నేను బ్రతికే ఉన్నానని తెలిపారు.

ఈ విధంగా పూనమ్ పాండే బ్రతికే ఉన్నాను అంటూ ఒక వీడియోని షేర్ చేయడంతో ఈమె పట్ల ఎంతోమంది సినీ సెలబ్రిటీలు( Celebrities ) తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.అలాగే కేసు నమోదు చేయాలి డిమాండ్ చేస్తున్నారు.ఈమె వీడియో చేయడానికి కారణం లేకపోలేదని తాను అవగాహన కల్పించడం కోసం ఇలాంటి పోస్ట్ చేశానని ఈమె తెలిపారు. ఇలా ఈ పోస్ట్ చేయడం పట్ల నటి కస్తూరి శంకర్ ( Kasturi Shankar ) స్పందించారు.

ఈ విషయం పై ఈమె స్పందిస్తూ.ఆమెకు 32 సంవత్సరాల వయసు అన్నప్పుడే నాకు అనుమానం వచ్చింది.ఇదంతా కూడా ఆమె పబ్లిసిటీ కోసమే చేశారు అంటూ కస్తూరి శంకర్ ఈమె వ్యవహార శైలిపై కామెంట్స్ చేసారు. ఇలా పబ్లిసిటీ కోసం క్యాన్సర్ అని చెప్పుకోవడం నిజంగా సిగ్గు చేటు అంటూ ఈమె చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
ఇలా కస్తూరి శంకర్ తరచూ ఇలాంటి వివాదాలపై స్పందిస్తూ వార్తలలో నిలుస్తూ ఉంటారు.తాజాగా ఈ ఘటన పై ఈమె చేసిన కామెంట్స్( Viral Comments ) వైరల్ అవుతున్నాయి.







