తెలుగుదేశం, జనసేన( TDP Janasena ) పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు వ్యవహారం ఒక కొలిక్కి రావడంతో, ఇక రెండు పార్టీలు ఉమ్మడిగా తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నాయి.విడివిడిగా అభ్యర్థుల జాబితాను( Candidates List ) ప్రకటించడం, జనసేనకు టిడిపి కేటాయించిన సీట్లపై ప్రకటన చేయడం కంటే, ఒకేసారి రెండు పార్టీలు తమ పార్టీల తరఫున పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితా ప్రకటిస్తే మంచిదనే అభిప్రాయానికి రెండు పార్టీల అధినేతలు వచ్చినట్లు తెలుస్తోంది.
అయితే అంతకంటే ముందుగా అభ్యర్థుల జాబితాను ప్రకటించే ముందు పొత్తులో భాగంగా రెండు పార్టీలు కోల్పోతున్న నియోజకవర్గాల్లోని ఆశావాహులను బుజ్జగించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని, తప్పనిసరి పరిస్థితుల్లో సీటు కేటాయించలేకపోతున్నామని, పొత్తు కోసం త్యాగం చేయాల్సి వచ్చిందని, కచ్చితంగా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కీలకమైన పదవులు ఇస్తామని ఆశావాహులు బుజ్జగించాలి అని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
ఇక టిడిపికి రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ బలమైన కేడర్( TDP Cadre ) ఉండడం, ఆ పార్టీ నుంచి పోటీ చేసేందుకు ప్రతి నియోజకవర్గం నుంచి తీవ్రమైన పోటీ ఉన్న నేపథ్యంలో, కొన్ని నియోజకవర్గాల్లో జనసేనకు పొత్తుల భాగంగా సీట్లను కేటాయించబోతున్నారు.టిడిపి తరఫున టికెట్ ఆశిస్తున్న వారిని బుజ్జగించాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు( Chandrababu Naidu ) డిసైడ్ అయిపోయారు.జనసేన తరపున కొన్ని బలమైన స్థానాల్లో కొంతమంది కీలక నాయకులూ పోటీ చేసేందుకు ఎప్పటి నుంచి క్షేత్ర స్థాయిలో పనిచేసుకుంటూ వెళ్తున్నారు.
దీంతో సీట్ల సర్దుబాటు ప్రకటన, అభ్యర్థుల జాబితా విడుదల తర్వాత రెండు పార్టీలకు చెందిన ఆశావాహుల నుంచి ఎటువంటి వ్యతిరేకత బహిర్గతం కాకముందే వారికి సర్ది చెప్పాలని, అయినా వినకపోతే పార్టీ నుంచి వారిని సాగనంపాలని, పార్టీ క్రమశిక్షణను చర్యలు తప్పవని హెచ్చరించాలని రెండు పార్టీలు డిసైడ్ అయ్యాయట.ప్రస్తుతం ఈ బుజ్జగింపుల వ్యవహారం ముగిసిన తర్వాత అభ్యర్థుల జాబితాను ప్రకటించేందుకు టిడిపి, జనసేన సిద్ధమవుతున్నాయి.