రొటీన్ లైఫ్‌ను స్పైస్ అప్ చేయడానికి చాలామంది అడపాదడపా ప్రాంక్స్, ఫన్నీ టాస్క్స్, జోకులు చేస్తుంటారు.ముఖ్యంగా ఆఫీస్ కొలీగ్స్ రోజువారీ స్ట్రెస్ నుంచి బయట పడేందుకు సరదా పనులు చేస్తారు.
అయితే ఇటీవల ఒక ఉద్యోగి ఎవరూ ఊహించని ఒక ఫన్నీ ప్రాంక్ చేశాడు.దానికి సంబంధించిన వీడియో ట్విట్టర్( Twitter ) లో చక్కర్లు కొడుతోంది.
ఆ వైరల్ అవుతున్న వీడియో క్లిప్ లో ఒక ఆఫీస్ రూమ్ ను మనం చూడవచ్చు.అందులో టేబుల్స్, వాటి మీద డెస్క్‌టాప్ కంప్యూటర్లు ఉన్నాయి.ఉద్యోగులు వాటి ముందు కూర్చుని పనులు చేస్తున్నారు.ఇదే రూమ్ లో ఉన్న ఒక ఉద్యోగి ఒక పెద్ద వస్తువుని తీసుకెళ్లి టేబుల్ మీద పెట్టాడు.మళ్ళీ ఇంకొక వస్తువుని తీసుకు పోయి టేబుల్ పై ఉంచాడు.ఆ రెండు వస్తువులు కలిసి ఒక పెద్ద కీబోర్డ్ లాగా తయారయ్యాయి.
అనంతరం ఆ వ్యక్తికి ఆ పెద్ద కీబోర్డు( keyboard )పై ఉన్న పెద్ద పెద్ద బటన్స్ నొక్కుతూ కనిపించాడు.పక్కనే ఉన్న ఉద్యోగులు( Employees ) అంత పెద్ద కీబోర్డ్ చూసి ఆశ్చర్యపోయారు.
ముఖ్యంగా పక్కనే ఉన్న ఒక ఎంప్లాయ్ బిత్తర పోయి వింత ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చాడు.
చూస్తుంటే ఈ కీబోర్డ్ పని చేయని డమ్మీ మోడల్ అని తెలుస్తోంది.సరదా కోసం, సహ ఉద్యోగులను నవ్వించడానికి సదరు వ్యక్తి దీన్ని ఆఫీస్ కు తీసుకొచ్చాడేమో.వారి ఎక్స్‌ప్రెషన్స్ కాప్చర్ చేయడానికి ఒక వ్యక్తి వీడియో రికార్డింగ్ కూడా చేశాడు.
దానిని @Crazyclipsonly ట్విట్టర్ పేజీ షేర్ చేసింది. ఫిబ్రవరి 4న అప్‌లోడ్ అయిన ఈ 12 సెకన్ల వీడియోకు 2.5 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.2 వేలకు పైగా లైక్స్ వచ్చాయి.దీన్ని చూసిన నెటిజన్లు కడుపుబ్బా నవ్వుకుంటున్నారు.ఇలాంటి కీబోర్డు తమకి కూడా ఒకటి కావాలని కొందరు ఫన్నీగా పేర్కొన్నారు.ఈ క్లిప్ ను మీరు చూసేయండి.