Saranya Pradeep : సుహాస్ కొత్త మూవీలో అదరగొట్టిన శరణ్య ప్రదీప్.. మంచి రోల్స్ ఇస్తే మాత్రం ఈమెకు తిరుగులేదంటూ?

నిన్న థియేటర్లలో విడుదలైన అంబాజీపేట మ్యారేజి బ్యాండ్ సినిమా( Ambajipeta Marriage Band ) పాజిటివ్ టాక్ తో థియేటర్లలో ప్రదర్శితమవుతోంది.ఈ సినిమాకు పోటీగా చాలా సినిమాలు విడుదలైనా ఆ సినిమాలేవీ పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకోలేదు.

 Saranya Pradeep Acting Skills Highlight For Ambajipeta Marriage Band Details He-TeluguStop.com

అయితే ఈ సినిమాలో సుహాస్ నటన కంటే శరణ్య ప్రదీప్ నటన హైలెట్ గా నిలిచింది.సుహాస్ అక్క పాత్రలో( Suhas Sister Role ) నటించిన ఈ నటి తన అద్భుతమైన నటనతో పాత్రకు ప్రాణం పోశారు.

ఫిదా తర్వాత చాలా సినిమాలలో నటించినా ఆమె అద్భుతమైన నటనకు తగిన పాత్ర ఈ సినిమాతోనే దక్కింది.టాలీవుడ్ స్టార్స్ మంచి పాత్రలు ఆఫర్ చేస్తే శరణ్య ప్రదీప్ దశ తిరిగినట్టేనని చెప్పవచ్చు.

Telugu Ambajipeta Band, Bhamakalapam, Fidaa, Priyamani, Saranya Pradeep, Suhas-M

న్యాచురల్ యాక్టింగ్ తో ఆకట్టుకుంటున్న శరణ్య ప్రదీప్( Saranya Pradeep ) నటిగా ఒక్కో మెట్టు అంతకంతకూ పైకి ఎదుగుతూ ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తున్నారు.శరణ్య ప్రదీప్ కు రాబోయే రోజుల్లో ఆఫర్లు మరింత పెరగాలని ఆమె మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.శరణ్య ప్రదీప్ సైతం వచ్చిన ప్రతి పాత్రకు ఓకే చెప్పకుండా మంచి పాత్రలకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఆమె రేంజ్ మరింత పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి. శరణ్య ప్రదీప్ రెమ్యునరేషన్( Remuneration ) సైతం అంతకంతకూ పెరుగుతోంది.

Telugu Ambajipeta Band, Bhamakalapam, Fidaa, Priyamani, Saranya Pradeep, Suhas-M

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ లో పద్మ పాత్ర( Padma Role )కు ఆమె పూర్తిస్థాయిలో న్యాయం చేశారు.అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా సులువుగానే బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.వరుసగా విజయాలను సొంతం చేసుకుంటూ సుహాస్ అంతకంతకూ క్రేజ్ ను పెంచుకుంటున్నారు.శరణ్య ప్రదీప్ భామాకలాపం2 సినిమా( Bhamakalapam 2 )లో కూడా నటించగా త్వరలో ఓటీటీలో విడుదల కానుంది.

భామాకలాపంకు సీక్వెల్ గా భామాకలాపం2 తెరకెక్కగా భామాకలాపం2 మెప్పిస్తుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube