ఆదిలాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) పర్యటించనున్నారు.ఈ మేరకు ఇంద్రవెల్లిలో జరిగే భారీ బహిరంగ సభకు రేవంత్ రెడ్డి తొలిసారిగా సీఎం హోదాలో హాజరుకానున్నారు.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత రేవంత్ రెడ్డి మొదటి అధికార పర్యటన ఇదే కావడం విశేషం.కాగా ఇంద్రవెల్లి వేదికగా సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లోక్ సభ ఎన్నికల ప్రచార శంఖారావాన్ని( Congress Lok Sabha Election Campaign ) పూరించనున్నారు.
ఇందులో భాగంగా ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా రెండు హామీల అమలుపై ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ తో పాటు రూ.500 లకే గ్యాస్ సిలిండర్ హామీలను రేవంత్ రెడ్డి ప్రకటించనున్నారని సమాచారం.అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా( Adilabad ) దత్తతపైనా రేవంత్ రెడ్డి ప్రకటన చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.