పాస్ పోర్టు కుంభకోణం( Passport Scam ) కేసులో తెలంగాణ సీఐడీ( Telangana CID ) దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.ఇందులో భాగంగా మరో ముగ్గురిని సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు.
ఈ ముగ్గురు ఆదిలాబాద్ పాస్ పోర్ట్ కేంద్రంలో పని చేస్తున్నారు.వీరితో పాటు ముంబైలో పాస్ పోర్ట్ ఏజెంట్ ను( Passport Agent ) సీఐడీ అదుపులోకి తీసుకుంది.
ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం 15 మంది అరెస్ట్ కాగా అరెస్టుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.నిందితులు అందరిని సీఐడీ( CID ) విచారించనుంది.కాగా ఈ వ్యవహారంలో 92 నకిలీ పాస్ పోర్టులను( Fake Passports ) సీఐడీ గుర్తించింది.అలాగే అరెస్ట్ అయిన ఏజెంట్ల నుంచి సేకరించిన సమాచారంతో 35కి పైగా పాస్ పోర్టులను రద్దు చేసిన సంగతి తెలిసిందే.