ప్రజలు తరచుగా సోషల్ మీడియాలో ఫన్నీ వీడియోలను పంచుకుంటారు.ఈ వీడియోలలో కొందరు ఆహార ప్రియులు వెర్రి పనులు చేసి చివరికి వారే చిక్కుల్లో పడుతుంటారు.
తాజాగా ఒక యువకుడు చాక్లెట్ ఫౌంటెన్‌ని( Chocolate Fountain ) సీక్రెట్‌గా నాకాలనుకున్న అనుకున్నాడు కానీ అతడికి ఊహించని షాక్ తగిలింది.చాక్లెట్ ఫౌంటెన్ అనేది టవర్ మీద నుంచి కరిగిన చాక్లెట్‌ను పోసే మెషిన్.
ప్రజలు సాధారణంగా పండ్లు లేదా కేక్‌లను ఈ చాక్లెట్‌లో ముంచి తింటారు.అయితే ఈ యువకుడు అందుకు భిన్నంగా చేశాడు.
ఫౌంటెన్‌లోంచి చాక్లెట్‌ని( Chocolate ) నాకేందుకు ప్రయత్నించాడు.ఇలా ఎంగిలి చేయడం చాలా తప్పు కానీ అతడు ఎవరు చూడకుండా త్వరగా నాకేసాడు.అతని నోటికి దాదాపు చాక్లెట్ తగిలింది, కానీ మధ్యలో అతని జుట్టు( Hair ) అడ్డంకిగా వచ్చింది.జుట్టు చాక్లెట్‌తో తడిచిపోయింది.ఆ దృశ్యాలకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.చార్లీ అండ్ ది చాక్లెట్ ఫ్యాక్టరీ( Charlie And The Chocolate Factory ) అనే సినిమాలో అత్యాశగల కుర్రాడు చాక్లెట్ నదిలో పడి ఇబ్బందులు పడినట్టే ఈ యువకుడు కూడా ఇబ్బందులు పడుతున్నాడని వీడియో చూసిన చాలామంది నవ్వుకుంటున్నారు.
చాలా మందికి అతడు చేసిన పని నచ్చలేదు.ఆ వీడియోపై వారు ఆగ్రహంతో వ్యాఖ్యలు చేశారు.“అతనికి శిక్ష పడాలి, చాలా మొరటుగా ప్రవర్తించాడు, పార్టీని నాశనం చేశాడు, అతనిపై కేసు పెట్టాలి.” అని చాలామంది ఆగ్రహంతో కామెంట్లు పెట్టారు.ఈ వీడియో క్లిప్ కి మూడు లక్షల దాకా లైక్‌లు, 75 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.వైరల్ అవుతున్న వీడియోని మీరు కూడా చూసేయండి.అలానే ఎవరికైనా చెడు చేయాలని చూస్తే చివరికి తమకే చెడు జరుగుతుందని నిజాన్ని అందరికీ తెలియజేయండి.