స్టార్ హీరోలు లేకపోయినా మంచి స్టోరీతో వచ్చి 175 రోజులు ఆడిన మూవీ.. ఏంటంటే..?

టెక్నాలజీ పెద్దగా అభివృద్ధి కాని అప్పటి కాలంలో మనుషుల మధ్య ప్రేమ, అనురాగం, ఆప్యాయతలకు కొదవ ఉండేది కాదు.బంధాలకు, అనుబంధాలకు కూడా ఎంతో విలువనిచ్చేవారు.

 Facts About Thatha Manavadu Movie , Sv Ranga Rao, Rajababu, Kaikala Satyanarayan-TeluguStop.com

అయితే రాను రాను మనుషుల్లో మానవత్వం తగ్గిపోయింది.సొంత తల్లిదండ్రులనే ఇంటి నుంచి వెళ్ళగొట్టేంత క్రూరంగా కొందరు మనుషులు మారిపోయారు.

ఇలాంటి ఒక మార్పును గమనించి వాటికి అద్దం పట్టేలా ఒక సినిమా తీసి ఘన విజయం సాధించాడో డైరెక్టర్.ఆ మూవీ మరేదో కాదు ఎస్వీ రంగారావు, రాజబాబు, కైకాల సత్యనారాయణ, అంజలీదేవి వంటి దిగ్గజ నటులు నటించిన “తాత-మనవడు”( tata-manavadu ).దానిని డైరెక్ట్ చేసింది దాసరి నారాయణరావు.

ఈ సినిమా తీయడానికి ముందు దాసరి నారాయణరావు( Dasari Narayana Rao ) కొన్ని సినిమాలలో పనిచేసి మంచి అనుభవం సంపాదించాడు.

అసిస్టెంట్‌ డైరెక్టర్‌, ప్రొడక్షన్‌ మేనేజర్‌, కథకుడిగా, మాటల రచయితగా కూడా వర్క్ చేస్తుండేవాడు.మనీ కోసం హిందీ, తెలుగు ట్యూషన్స్‌ కూడా తీసుకునేవాడు.హైకోర్టు దగ్గర పార్ట్‌టైమ్‌ టైపిస్టుగా, పార్ట్‌ టైమ్‌ అకౌంటెంట్‌గా కూడా పని చేస్తూ చాలా బిజీగా ఉండేవాడు.ఇక తాత మనవడు సినిమా తీసిన ప్రొడ్యూసర్ రాఘవ కూడా చాలానే కష్టాలను పడ్డాడు.

ట్రాలీ పుల్లర్‌, ఆఫీస్‌ బోయ్‌, ప్రొడక్షన్‌ అసిస్టెంట్‌, స్టంట్‌ అసిస్టెంట్‌, డాన్స్‌ కంపోజర్‌.ఇలా చెప్పుకుంటూ పోతే సినిమా రంగంలో అనేక పనులు చేస్తూ అంచెలంచెలుగా ఎదిగాడు.

Telugu Anjali Devi, Dasari Yana Rao, Rajababu, Sv Ranga Rao, Tata Manavadu-Telug

స్నేహితులతో కలిసి సినిమాల నిర్మించడం కూడా స్టార్ట్ చేశాడు.లాభాలు వచ్చాక సొంతంగా ప్రతాప్‌ ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌ కంపెనీ( Pratap Art Productions Company ) కూడా ప్రారంభించాడు.దాసరి నారాయణరావులోని ప్రతిభను గుర్తించి మంచి కథ రాసుకొని వస్తే ప్రొడ్యూస్ చేయడానికి రెడీగా ఉంటానని రాఘవ చెప్పాడు.దాంతో సంబరపడిపోయిన దాసరి కథ రెడీ చేసుకున్నాడు.

ఆపై డిస్ట్రిబ్యూటర్‌ని కూడా ఒప్పించడానికి ఓ డిస్ట్రిబ్యూటర్‌ ఆఫీస్‌కి వెళ్లి ఇన్‌ఛార్జ్‌కి స్టోరీ వినిపించాడు.కానీ అతడు మెచ్చలేదు.

తర్వాత మరో డిస్ట్రిబ్యూటర్‌ కు స్టోరీ వినిపించగా ఆయనకు అది బాగా నచ్చి వెంటనే ఓకే చెప్పేసారు.ఆ విధంగా 1972లో ‘తాత-మనవడు’ షూటింగ్‌ మొదలై 1973లో పూర్తయింది.

Telugu Anjali Devi, Dasari Yana Rao, Rajababu, Sv Ranga Rao, Tata Manavadu-Telug

ఈ సినిమాలో గుమ్మడి పాత్ర కోసం మొదట నాగభూషణంను తీసుకోవాలని దాసరి అనుకున్నాడు కానీ రెమ్యూనరేషన్ విషయంలో తేడాలు వచ్చి నాగభూషణం ఈ మూవీ చేసేందుకు ఒప్పుకోలేదు.సూర్యకాంతాన్ని కూడా తీసుకోవాలని దాసరి ఎంతో ఆశపడ్డాడు కానీ అదీ కుదరలేదు.తాతమనవడు సినిమాకి రమేష్‌ నాయుడు మ్యూజిక్‌ అందించాడు.ఈ మూవీ డైరెక్ట్ చేసినందుకు నెలకు రూ.200 చొప్పున దాసరి పారితోషికం పుచ్చుకున్నాడు.ఎస్‌.

వి.రంగారావు రూ.2,000 పారితోషికం తీసుకున్నాడు.రూ.5 లక్షల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా 1972, డిసెంబర్‌ 27న సెన్సార్‌ సర్టిఫికెట్ పొందింది.1973 మార్చి 23న విడుదలై సూపర్ డూపర్ హిట్ అయింది కొన్ని థియేటర్లలో 175 రోజులు పాటు ఆడి కలెక్షన్ల వర్షం కురిపించింది.ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వంటి స్టార్ హీరోలు ఎవరూ లేకపోయినా ఈ సినిమా ఆ రేంజ్ లో హిట్ కావడం అప్పట్లో ఒక సంచలనం అయ్యింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube