దుర్బుద్ధి వీడి గౌరవాన్ని కాపాడుకోండి - బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య

రాజన్న సిరిసిల్ల జిల్లా : బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు దుర్బుద్ధి వీడి తమ గౌరవాన్ని కాపాడుకోవాలని రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ప్రజా ప్రతినిధులు గ్రహించాలని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య ఘాటుగా విమర్శించారు .ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మీడియాతో మాట్లాడుతూ నిన్నటి రోజు దుమాల గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో జడ్పిటిసి చీటీ లక్ష్మణ్ రావు అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు.

 Leave The Delusion And Save The Honor Block Congress President Dommati Narasiah,-TeluguStop.com

తెలంగాణ ప్రజలు ఇచ్చిన మార్పును జీర్ణించుకోకుండా అబద్ధపు మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రజా ప్రతినిధులు హుందాగా వ్యవహరించి వారి నైతికతను కాపాడుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు షేక్ గౌస్, కార్యదర్శి లింగం గౌడ్, నాయకులు తిరుపతి గౌడ్, సత్తయ్య, రామచందర్, రామ్ రెడ్డి, చెన్ని బాబు, ఎండి రఫీక్, కొత్తపల్లి దేవయ్య పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube