యాంకర్ సుమ( Anchor suma ) కనకాల.రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.
తెలుగు బుల్లితెర పై మకుటం లేని మహారాణిగా దూసుకుపోతోంది సుమ.చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరికి సుమ సుపరిచితమే.బుల్లితెర పై అటు వెండితెర పై ఏ షోలో ఏ ఈవెంట్ లో చూసిన కూడా సుమ పేరే వినిపిస్తూ ఉంటుంది.ఈవెంట్ లకు, షోలకు, ప్రమోషన్ లకు, ప్రీ రిలీజ్ వేడుకలకు ఇలా ప్రతి ఒక్క షోకి హోస్ట్ గా వ్యవహరిస్తూ ఇప్పటివరకు కోట్లల్లో సంపాదించింది యాంకర్ సుమ.ఒక్క షోకి దాదాపు 5 లక్షలు తీసుకుంటోంది యాంకర్ సుమ.అయితే ఈ మధ్యకాలంలో చూసుకుంటే సుమ హవా చాలా వరకు తగ్గిపోయిందని చెప్పవచ్చు.

సుమ పేరుకు బదులుగా ఎక్కువగా యాంకర్ శ్రీముఖి పేరే వినిపిస్తోంది.ఇది ఇలా ఉంటే తాజాగా సుమ చేసిన పనికి అభిమానులు, నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.యాంకర్ గా, నటిగా దాదాపు ఇరవై ఏళ్లుగా తెలుగు ప్రేక్షకులని మెప్పిస్తూ మన ఇంట్లో ఆడపడుచు అయిపోయింది.ఇప్పటికి సుమ టీవీ షోలు, సినిమా ఈవెంట్స్ తో బిజీగా ఉంటుంది.
ముఖ్యంగా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి కచ్చితంగా సుమ ఉండాల్సిందే.అయితే యాంకర్ గా సుమ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి బాగానే ఛార్జ్ చేస్తుంది.
కానీ ఇటీవల ఒక హీరో ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఫ్రీగా చేస్తానని మాట ఇచ్చింది.బిగ్ బాస్ తో ఫేమ్ తెచ్చుకున్న సోహెల్ ఇప్పుడు హీరోగా వరుస సినిమాలు చేస్తున్నాడు.
ఇటీవలే మిస్టర్ ప్రగ్నెంట్ సినిమాతో మంచి విజయం సాధించాడు సోహెల్.త్వరలో బూట్‌కట్ బాలరాజు( Bootcut Balaraju ) అనే సినిమాతో రాబోతున్నాడు.

ఈ సినిమా ఫిబ్రవరి 2న రిలీజ్ కానుంది.దీంతో సోహెల్ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు.ఈ ప్రమోషన్స్ లో భాగంగా సోహెల్, మూవీ హీరోయిన్ సుమ అడ్డా షోకి వెళ్లారు.ఈ షోలో సోహెల్ యాంకర్ సుమ గురించి చెప్తూ ఎమోషనల్ అయ్యాడు.
సోహెల్ ( Syed sohel )సుమ అడ్డా షోలో మాట్లాడుతూ.రీసెంట్ గా సుమ అక్క మేనేజర్ కి కాల్ చేశాను నా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎక్కువ డబ్బులు ఇవ్వలేను కొంచెం తగ్గించండి అని అడిగాను.

సరే అక్కతో మాట్లాడి చెప్తా అన్నాడు.తర్వాత సుమ అక్క నుంచి కాల్ వచ్చింది.లిఫ్ట్ చేసి అక్కా నేను అమౌంట్ తక్కువ ఇద్దాం అనుకుంటున్నా.నేనే ప్రొడ్యూసర్, అంత డబ్బులు లేవు, చాలా కష్టపడుతున్నాను అని చెప్తే.నేను నీ దగ్గర డబ్బులు తీసుకోను, నా కొడుకు సినిమా కూడా చేసాను అదంతా నాకు తెలుసు.లైఫ్ లో ఇంత ఎదిగింది ఎందుకు, మీలాంటి వాళ్లకి సపోర్ట్ చేయడానికే అని నాకు ఫ్రీగా చేస్తాను అన్నారు ప్రీ రిలీజ్ ఈవెంట్.
థ్యాంక్యూ అక్క నేనెప్పటికీ మర్చిపోలేను అంటూ ఎమోషనల్ అయ్యాడు సోహెల్.







