2024 రానే వచ్చింది.కొత్త ఏడాది ప్రారంభం అవుతుంది అంటే దాదాపు ప్రతి ఒక్కరూ కొన్ని గోల్స్ ను పెట్టుకుంటూ ఉంటారు.
ఇందులో భాగంగానే వెయిట్ లాస్ అవ్వాలని ప్లాన్ చేసుకున్నవారు ఎంతో మంది ఉన్నారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ గురించి మీరు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే.బరువు తగ్గడానికి ఈ డ్రింక్ అద్భుతంగా తోడ్పడుతుంది.
అదే సమయంలో మీకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు సైతం అందిస్తుంది.మరి ఇంతకీ వెయిట్ లాస్( Weight loss ) కు హెల్ప్ చేసే ఆ డ్రింక్ ను ఎలా తయారు చేసుకోవాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక గ్లాసు తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ మెంతులు( Fenugreek ) మరియు వన్ టేబుల్ స్పూన్ సోంపు గింజలు( Fennel seeds ) వేసి వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.మరుసటి రోజు స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకుని అందులో నానబెట్టుకున్న మెంతులు, సోంపు గింజలను వాటర్ తో సహా వేసుకోవాలి.దాదాపు పది నుంచి పన్నెండు నిమిషాల పాటు ఉడికించి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.మరిగిన వాటర్ ను స్టైనర్ సహాయంతో ఫిల్టర్ చేసుకోవాలి.
ఈ వాటర్ లో ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్లు లెమన్ జ్యూస్ మిక్స్ చేస్తే మన డ్రింక్ సిద్ధం అవుతుంది.రోజు ఉదయం ఈ డ్రింక్ ను తీసుకోవడం వల్ల బహుళ ప్రయోజనాలు ఉన్నాయి.ప్రధానంగా బరువు తగ్గడానికి ఈ డ్రింక్ చక్కగా తోడ్పడుతుంది.సోంపు గింజలు ఆకలిని అణిచివేసే ప్రభావాన్ని కలిగి ఉంటాయి.జీవక్రియ బూస్టర్ గా కూడా పని చేస్తాయి.అలాగే మెంతులు కొవ్వు నిల్వ ను తగ్గిస్తుంది.
నిమ్మకాయ ఒక డిటాక్సిఫైయర్.ఇది జీవక్రియను పెంచడానికి, శరీరం నుండి విషాన్ని తొలగించడానికి సహాయపడుతుంది.
అదే సమయంలో శరీరం నుండి అదనపు కొవ్వును తగ్గిస్తుంది.అందువల్ల బరువు తగ్గాలనుకునేవారు మెంతులు సోంపు మరియు నిమ్మ రసం తో పైన చెప్పిన విధంగా డ్రింక్ ను తయారు చేసుకుని తీసుకుంటే వేగంగా బరువు తగ్గుతారు.
అదే సమయంలో బాడీలో పేరుకుపోయిన వ్యర్థాలు తొలగిపోతాయి.రక్తంలోని చక్కెర స్థాయిల్లో హెచ్చుతగ్గులు ఏర్పడకుండా ఉంటాయి.
రోగ నిరోధక వ్యవస్థాపన బలపడుతుంది.మరియు మలబద్ధకం సమస్య ఉన్న కూడా దూరం అవుతుంది.