మహీంద్రా గ్రూప్ అధిపతి ఆనంద్ మహీంద్రా( Anand Mahindra ) సోషల్ మీడియాలో తరచుగా ఆసక్తికరమైన పోస్టులను షేర్ చేస్తుంటారు.ఆయన షేర్ చేసే పోస్టులు ఆలోచింపజేసేలా, ఆశ్చర్యపరిచేలా ఉంటాయి.
తాజాగా ఆనంద్ మహీంద్రా మరో ఆసక్తికరమైన వీడియో పంచుకున్నారు.ఈ వీడియో కూడా చాలా మందిని ఆశ్చర్యపరిచింది.
ఆ వీడియోలో చాలా ప్రమాదకర, ఫన్ యాక్టివిటీ కనిపించింది.

ఆనంద్ షేర్ చేసిన వీడియోలో, కొందరు వ్యక్తులు మృదువుగా ఉన్న పెద్ద చాపపై దూకుతున్నారు.గాలిలో ఎగురుతున్న పెద్ద బెలూన్‌కి ఆ మ్యాట్( Mat ) వేలాడుతోంది.తాళ్లతో ఆ మ్యాట్‌ను హాట్ బెలూన్ కి అటాచ్ చేశారు.
దీనిపై ఎగురుతూ దూకుతూ గెంతుతూ ఎంజాయ్ చేస్తున్నా ప్రజలు సురక్షితంగా ఉండేందుకు ప్రత్యేక దుస్తులు, తాళ్లు ధరించారు.వారు గాలిలో చాలా ఎత్తు సరదాగా ఆడుకుంటూ చాలా సంతోషంగా, ఉత్సాహంగా కనిపించారు.

ఈ వ్యక్తులు ధైర్యంగా కొన్ని వేల మీటర్ల ఎత్తులో ఈ పని చేస్తూ కనిపించారు.ఇలాంటి పనిచేయడానికి చాలామంది జంకుతారు.వీడియో చూడటానికి చాలా అందంగా ఉంది.ఈ యాక్టివిటీని తాnu ప్రయత్నించాలనుకోవడం లేదని ఆనంద్ మహీంద్రా చెప్పారు.“దీనిని ప్రయత్నించడం నా బకెట్ లిస్ట్ లో లేదు.” అని ఆనంద్ ఓ క్యాప్షన్ జోడించారు.కాగా ఆ వీడియో ఇంటర్నెట్‌లో బాగా పాపులర్ అయింది.దీనికి 220,000 కంటే ఎక్కువ వ్యూస్ వచ్చాయి.చాలా మంది ఈ వీడియోను లైక్ చేసి కామెంట్ చేశారు.చూసేందుకు ఇది చాలా బాగుంది కానీ రియల్ లైఫ్( Real Life ) లో ఇలా చేయడానికి మాత్రం చాలా భయం వేస్తుంది అని కొందరు పేర్కొన్నారు.
దీనిని మీరూ చూసేయండి.







