ఏపీలో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు స్పీకర్ డెడ్ లైన్..!

ఏపీలో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు స్పీకర్ తమ్మినేని సీతారాం( Speaker Thammineni Seetharam ) నోటీసులు ఇచ్చారు.ఈ మేరకు ఈనెల 29న స్పీకర్ కార్యాలయానికి స్వయంగా వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.

 Speaker Thammineni Seetharam Deadline For Mlas Who Changed Parties In Ap Details-TeluguStop.com

కాగా మొత్తం ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు ఏపీ స్పీకర్ కార్యాలయం నోటీసులు పంపింది.అలాగే ఇద్దరు ఎమ్మెల్సీలకు మండలి ఛైర్మన్ నోటీసులు పంపారని తెలుస్తోంది.

ఈనెల 29న హాజరుకాని వారిపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.ఎనిమిది మందిలో వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి,( Mekapati Chandrasekhar Reddy ) ఉండవల్లి శ్రీదేవి,( Undavalli Sridevi ) ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఉండగా టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలుగా వల్లభనేని వంశీ, మద్దాలి గిరి, వాసుపల్లి గణేశ్ మరియు కరణం బలరాం ఉన్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube