తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది నటులు వాళ్ళకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకోవడానికి అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు.ఇక ఇలాంటి క్రమంలోనే తమిళ్ సినిమా ఇండస్ట్రీకి చెందిన ధనుష్( Dhanush ) కూడా ప్రస్తుతం వైవిధ్యమైన కథాంశాలను ఎంచుకుంటూ సినిమాలుగా చేస్తూ ముందుకు సాగుతున్నాడు.
ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేసిన చాలా సినిమాలు మంచి విజయలను అందుకున్నప్పటికీ తెలుగులో ఆయనకు మాత్రం అంత మంచి గుర్తింపు అయితే రావడం లేదు.

ఇక ఇంతకు ముందు ఆయన చేసిన సార్ సినిమా మంచి విజయాన్ని అందుకున్నప్పటికీ ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన కెప్టెన్ మిల్లర్ పరిస్థితి ఏంటి అనేది కూడా తెలియాల్సి ఉంది.ఈ సినిమా కనక సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకుంటే తెలుగులో ఆయన స్టార్ హీరోగా మంచి గుర్తింపు ను సంపాదించుకుంటాడు.ఇక ఇప్పటికే శేఖర్ కమ్ముల( Sekhar Kammula ) దర్శకత్వంలో తెలుగులో ఒక సినిమా చేస్తున్న ధనుష్ ఈ సినిమాతో తన సత్తా చాటుకోవాలని చూస్తున్నాడు.
మరి ఇలాంటి క్రమంలో ధనుష్ ఇంకా ఎలాంటి సినిమాతో ప్రేక్షకులను మెప్పిస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది.

ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలు అన్ని మంచి విజయాలను అందుకుంటేనే ఆయన తెలుగు స్టార్ హీరోలతో పాటు పోటీ పడగలుగుతాడు.లేకపోతే మాత్రం తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటికే స్టార్ హీరోలు చాలామంది ఉన్నారు కాబట్టి ధనుష్ ను తెలుగులో ఆదరించడం చాలా కష్టమవుతుందనే చెప్పాలి.నటన లో ధనుష్ అత్యుత్తమమైన పర్ఫామెన్స్ ని ఇచ్చినప్పటికీ సక్సెస్ లు కూడా ఉంటేనే స్టార్లు గా మారుతారు.
అందుకే తనకు అర్జెంటుగా సక్సెస్ సినిమాలనేవి రావాలి లేకపోతే మాత్రం కష్టమే…ఇక ప్రస్తుతం ధనుష్ తెలుగు మీద ఎక్కువ ఫోకస్ చేయినట్టు గా తెలుస్తుంది…
.







