స్కూల్ కి వెళ్లే పిల్లలున్న చాలా మంది తల్లిదండ్రులకు ఒక సాధారణ సమస్య ఉంటుంది, అదేంటంటే వారి పిల్లలు తరచుగా పాఠశాలలో వాటర్ బాటిళ్లను( Water Bottle ) పోగొట్టుకుంటారు.ఇన్‌స్టాగ్రామ్‌లో ఫన్నీ వీడియోలు చేసే ఒక మహిళ ఈ సమస్యను చాలా వింతగా ఎగతాళి చేయాలని నిర్ణయించుకుంది.
అందుకే ఆమె తన కొడుకు కోసం పర్సులా( Purse ) కనిపించే భారీ గ్లాస్ వాటర్ బాటిల్‌ను కొనుగోలు చేసింది.వివిధ రకాల పండ్లు, రుచులు ఉన్న నీటితో ఆమె బాటిల్‌ను ఎలా నింపిందో వీడియో కూడా చూపించింది.

తన కొడుకు కోసం నీటిని మరింత ఫ్యాన్సీగా, రుచికరంగా మార్చాలనుకుంటున్నట్లు ఆమె చెప్పింది.ఆ వీడియోను ఎక్స్ వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసి, తన కొడుకు ఆ బాటిల్‌ని చాలా ఇష్టపడతాడని, స్కూల్‌లో( School ) దానిని ఎప్పటికీ మర్చిపోడని చెప్పింది.డెస్క్‌పై బాటిల్‌ను షో చేసి మరీ మిగతా పిల్లలకు అసూయ పుట్టేలా చేస్తాడని పేర్కొంది.ఆమె తన పోస్ట్‌కి ‘సెటైర్’( Satire ) అనే పదాన్ని జోడించింది, అంటే ఆమె సీరియస్‌గా లేదని, ఫన్నీగా దీనిని తయారు చేశానని స్పష్టం చేసింది.

అయితే ఆమె సరదాగా మాట్లాడుతోందని కొంతమందికి అర్థంకాక హేళన చేశారు.“ఎవరైనా పొరపాటున పగలగొడితే బస్సులో బాటిల్ అన్ని చోట్లా చిందుతుంది,” లేదా “అతను పొరపాటున బాటిల్‌ను పడవేస్తే పరిస్థితి ఏంటి?” అని కామెంట్లు చేశారు.ఈ ఐడియా చాలా క్రియేటివ్ గా ఉందని మరి కొంతమంది పేర్కొన్నారు.ఇంకొంతమంది నెటిజన్లు బాగా నవ్వుకున్నారు.వీడియో బాగా పాపులర్ అయింది, దీనికి 1 కోటికి పైగా వ్యూస్ వచ్చాయి.దీనిని మీరు కూడా చూసేయండి.







