'కుటుంబం లో చీలిక ' జగన్ పై షర్మిల సంచలన కామెంట్స్

కాంగ్రెస్ లో చేరడమే కాకుండా, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన వైస్ షర్మిల( ys Sharmila ) పై తన అన్న, వైసిపి అధినేత ఏపీ సీఎం జగన్ ( AP CM Jagan )విమర్శలు చేస్తూ వార్తల్లో ఉంటున్నారు.ప్రస్తుతం జిల్లాల పర్యటనలు చేస్తున్న షర్మిల ఏపీలో ఎక్కడా అభివృద్ధి కనిపించడం లేదని, అవినీతి చోటుచేసుకుందని విమర్శలు చేస్తున్నారు.

 Sharmila's Sensational Comments On Jagan's 'split In The Family', Jagan, Ysrcp,-TeluguStop.com

రెండు రోజుల క్రితం శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో పర్యటించిన షర్మిల ఈ సందర్భంగా తన అన్న జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు.జగన్ రెడ్డి అంటూ సంబోధిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.

తాజాగా కాకినాడలో పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశమైన షర్మిల జగన్, కాంగ్రెస్ పై చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు.రాష్ట్రాన్ని , తన కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ చీల్చింది అంటూ నిన్న జగన్ చేసిన వ్యాఖ్యలపై షర్మిల ఘాటుగానే స్పందించారు.

Telugu Ap Cm Jagan, Ap Congress, Ap, Jagan, Pcc, Ys Rajashekara, Ys Sharmila, Ys

వైయస్ కుటుంబం చీలింది అంటే దానికి కారణం జగనన్న చేజేతులా చేసుకున్నదే.అందుకు సాక్ష్యం దేవుడు, నా తల్లి విజయమ్మ.వైసిపి ఇబ్బందుల్లో ఉంటే 18 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు.వాళ్లను మంత్రులను చేస్తానని చెప్పి జగన్ మోసం చేశారు.పార్టీ కోసం నెలల తరబడి 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేశాను.తెలంగాణలో ఓదార్పు యాత్ర చేసాను.సమైక్యాంధ్ర కోసం పాదయాత్ర కొనసాగించాను.ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు స్వలాభం చూసుకోకుండా జగనన్న గెలుపు కోసం అండగా నిలబడి ప్రచారం చేశా ” అంటూ షర్మిల గతాన్ని గుర్తు చేసుకున్నారు .

Telugu Ap Cm Jagan, Ap Congress, Ap, Jagan, Pcc, Ys Rajashekara, Ys Sharmila, Ys

అలాగే పోలవరం ప్రాజెక్టు అంశాన్ని షర్మిల ప్రస్తావించారు ఈ ప్రాజెక్టు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ( YS Rajasekhar Reddy )కలల ప్రాజెక్టు అని, 1941లో దాన్ని నిర్మించాలనుకుంటే ఏ నాయకుడు సాహసం చేయలేదని, కానీ వైఎస్ .రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన ఆరు నెలల్లోనే పోలవరం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారని షర్మిల వ్యాఖ్యానించారు.అసలు ఈ ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేకపోయారో జగన్ సమాధానం చెప్పాలని షర్మిల నిలదీశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube