ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల( YS Sharmila ) హాట్ కామెంట్స్ చేశారు.బీజేపీని తుంగలోకి తొక్కాలన్న ఆమె రాష్ట్రంలో కుమ్మక్కు రాజకీయాలు నడుస్తున్నాయని ఆరోపించారు.
పాలక పక్షం, ప్రతిపక్షం బీజేపీతో ములాఖత్ అయ్యారని వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు.ప్రత్యేక హోదా కోసం టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu ) ఎప్పుడు పోరాటం చేయలేదని మండిపడ్డారు.
బీజేపీతో వైసీపీ కంటికి కనిపించని పొత్తు పెట్టుకుందని ఆరోపణలు చేశారు.
ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో హోదా కోసం గట్టిగా మాట్లాడారన్న వైఎస్ షర్మిల అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్క మాట కూడా మాట్లాడలేదని విమర్శించారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విశాఖ ఉక్కును నిర్వీర్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ క్రమంలోనే ఇప్పుడున్న ప్రభుత్వాలు పోవాలన్న ఆమె కాంగ్రెస్ రావాలని పిలుపునిచ్చారు.