ఎన్నికల హామీలను నెరవేర్చుతామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి( Minister Komatireddy Venkatreddy ) తెలిపారు.ఈ క్రమంలోనే హామీల అమలుపై ఇవాళ సమీక్షించామని పేర్కొన్నారు.
ఇచ్చిన హామీలను వంద రోజుల్లోనే అమలు చేసి తీరుతామని కోమటిరెడ్డి తెలిపారు.ఇందులో భాగంగానే వచ్చే నెల నుంచి 200 యూనిట్ల ఉచిత విద్యుత్( Free Electricity Scheme ) అందిస్తామని స్పష్టం చేశారు.

గతంలోని బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్వాకం వలన రాష్ట్రం నాశనమైందని ఆరోపించారు.అందుకే హామీల అమలుకు జాప్యం అయిందని తెలిపారు.అలాగే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా రాదని చెప్పారు.కాళేశ్వరం( Kaleshwaram )తో పాటు రాష్ట్రంలో జరిగిన అన్ని అక్రమాలపై విచారణ కొనసాగుతోందని తెలిపారు.







