బత్తాయి తోటలను ఆశించే తెగుళ్లు ఇవే.. నివారించే సరైన పద్ధతులు..!

వ్యవసాయ రంగం( Agriculture )లో అధిక దిగుబడులు సాధించడం కోసం రైతులు ఎక్కువగా రసాయన ఎరువులపై ఆధారపడుతూ ఉండడం వల్ల వివిధ రకాల చీడపీడల, తెగుళ్ల బెడద అధికం అవుతోంది.కాబట్టి రైతులు అధిక ప్రాధాన్యత కేవలం సేంద్రీయ ఎరువులకే ఇవ్వాలని వ్యవసాయ క్షేత్ర నిపుణులు చెబుతున్నారు.

 Cultivation Methods Of Mosambi Farming, Orange, Lemon,copper Oxychloride Borde-TeluguStop.com

ఇక ఉద్యాన తోటల పరిస్థితి మరింత దారుణంగా మారుతోంది.దాదాపుగా 25 నుంచి 30 ఏళ్ల వరకు దిగుబడులు ఇవ్వాల్సిన తోటలు కేవలం 10 నుంచి 15 ఏళ్లకు మించి నిలబడడం లేదు.

వీటిలో కాయ నాణ్యతను దిగుబడిని తగ్గించేవి కొన్ని అయితే చెట్లను నిలువునా ఎండిపోయేలా చేసే ప్రమాదకరమైన తెగుళ్లు మరికొన్ని.కాబట్టి బత్తాయి తోటలను ఆశించే తెగుళ్లు ఏవో.వాటిని తొలిదశలోనే అరికట్టే పద్ధతులు ఏవో తెలుసుకుందాం.

వాతావరణ పరిస్థితుల కారణంగా బత్తాయి తోటలకు తెగుళ్ల ఉధృతి తో పాటు చీడపీడల ఉధృతి కూడా పెరిగే అవకాశం ఉంది.బత్తాయి తోటలకు( Mosambi Farming ) తీవ్ర నష్టం కలిగించే తెగుళ్లలో గజ్జి తెగుళ్లు, వేరుకుళ్ళు తెగుళ్లు, బంక తెగుళ్లు కీలక పాత్ర పోషిస్తాయి.ఈ తెగుళ్లను సకాలంలో గుర్తించి తొలిదశలోనే అరికట్టకపోతే ఊహించని నష్టాలను ఎదుర్కోవలసి ఉంటుంది.

బత్తాయి తోటలలో గజ్జి తెగుళ్ల లక్షణాలు( Scabies pest ) గుర్తించిన తర్వాత మూడు గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ ను ఒక లీటరు నీటిలో కలిపి చెట్లు పూర్తిగా తడిచేటట్లు పిచికారి చేయాలి.లేదంటే ఒక గ్రాము స్ట్రేప్టోసైక్లిన్ ను ఒక లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.

బంక తెగుళ్లను బత్తాయి తోటలలో గుర్తించిన తర్వాత కాపర్ ఆక్సి క్లోరైడ్ బోర్డాక్స్ మిశ్రమం( Copper Oxychloride Bordeaux mixture )ను పిచికారి చేసి నివారించాలి.వేరు కుళ్ళు తెగులను బత్తాయి తోటలలో గుర్తించిన తర్వాత ట్రరైకోడెర్మి విరిడి కల్చర్ ను వేరు మొదల్లో వేయాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube