ఏపీలో అంగన్వాడీ కార్యకర్తల తొలగింపు ప్రక్రియ( Anganwadis Removal Process )ను రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుందని తెలుస్తోంది.అంగన్వాడీలు సమ్మెను విరమించడంతో సర్కార్ ఉత్తర్వులను వెనక్కి తీసుకుంది.
అయితే తమ కోరికలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల సమ్మె కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే ఎస్మా చట్టాన్ని( Esma Act ) ప్రయోగించిన ప్రభుత్వం నోటీసులు పంపినా అంగన్వాడీలు వెనక్కి తగ్గలేదు.అంతేకాకుండా సమ్మెను మరింత ఉధృతం చేశారు.దీంతో అంగన్వాడీలను తొలగించాలంటూ అన్ని జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది.
ఈ నేపథ్యంలో అంగన్వాడీలు సమ్మెను విరమించడంతో మళ్లీ ఉత్తర్వులను వెనక్కి తీసుకుందని సమాచారం.







