స్టైలిష్ ఎలక్ట్రిక్ రిక్షా చూశారా.. నెటిజన్లను ఆశ్చర్యపరుస్తున్న వీడియో..

ఎగిరే కార్లలో చక్కర్లు కొట్టాలని చాలా మంది కలలు కన్నారు కానీ ఇప్పటికీ ఆ కల నెరవేరలేదు.ఆ కలలను సాకారం చేసేందుకు పలు కంపెనీలు ఫ్లయింగ్ కార్లను టెస్ట్ చేస్తున్నాయి.

 Have You Seen The Stylish Electric Rickshaw The Video Is Surprising The Netizens-TeluguStop.com

ఈ టెస్టులు కూడా విజయవంతం అవుతున్నాయి.దాంతో ఆ కల నెరవేరే సూచనలు కనిపిస్తున్నాయి.

ఇంతలో మార్కెట్లోకి చాలా మోడర్న్, అడ్వాన్స్‌డ్‌ కార్లు ఎంట్రీ ఇస్తూ ఆకట్టుకుంటున్నాయి.భారతదేశంలో కూడా వాహనాలు చాలా మోడ్రన్ గా మారుతూ ఆకర్షిస్తున్నాయి.

తాజాగా ముంబైలో( Mumbai ) ఓ కొత్త తరహా మూడు చక్రాల వాహనం ప్రజలను ఆశ్చర్యపరిచింది.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వర్లీ ( Worli )ప్రాంతంలోని బిజీగా ఉండే వీధిలో ఈ మూడు చక్రాల వాహనాన్ని ఒకరు వీడియో రికార్డ్ చేశారు.ఆ వీడియోలో ఈ త్రీ వీలర్ రిక్షా రెడ్ లైట్ వద్ద ఆగడం మనం చూడవచ్చు.చాలా మోడర్న్, యూనిక్‌గా అది కనిపించింది.మామూలు ఆటోరిక్షాలా ( Autorickshaw )కాకుండా ఇది భిన్నమైన షేప్, స్టైల్‌లో చాలా అట్రాక్టివ్ గా కనిపించింది.దీనిని చూసి ఇది చాలా అద్భుతంగా ఉందని, ‘వావ్’ అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేసిన కొంత సమయానికి సూపర్ పాపులర్ అయింది.ప్రజలు ఈ మూడు చక్రాల వాహనం గురించి మరింత తెలుసుకోవాలనుకున్నారు.దాని పేరు ఏంటి, ఎవరు తయారు చేసారు? అని ఒకరు అడిగారు.దీని గురించి తెలిసిన కొంతమంది సమాధానాలు చెప్పారు.వారి ప్రకారం ఈ త్రీవీలర్‌ను లింక్స్ లీన్ ఎలక్ట్రిక్ అని పిలుస్తారట.డెన్మార్క్‌కు చెందిన లింక్స్ కార్స్ అనే కంపెనీ దీన్ని తయారు చేసింది.దీనికి రెండు సీట్లు ఉన్నాయి.

అది టర్నింగ్ తీసుకున్నప్పుడు వంగి ఉంటుంది.దీన్ని భారతదేశానికి తీసుకురావడానికి రూ.31 లక్షలు ఎక్స్‌ట్రా డబ్బు ఖర్చు అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube