ఈ కుక్క మామూలుది కాదు.. టీవీ షోలను ఎలా చూస్తుందో చూడండి...

ఈ రోజుల్లో పెద్దవారి నుంచి పసిపిల్లల వరకు చాలామంది స్మార్ట్‌ఫోన్లకు బాగా అడిక్ట్ అవుతున్నారు.ఖాళీ సమయం దొరికితే చాలు మొబైల్ ఫోన్లకు అతుక్కుపోతున్నారు.

 Viral Video Of Pet Dog Busy Watching Show On Phone Details, Viral Video ,pet Dog-TeluguStop.com

అయితే మనుషులే కాదు జంతువులు( Animals ) కూడా స్మార్ట్‌ఫోన్లలో వీడియో కంటెంట్ చూసేందుకు అలవాటు పడుతున్నాయి.ఇప్పటికే కొన్ని కోతులు ఫోన్ల ముందు కూర్చుని మొబైల్ ఫోన్( Mobile Phone ) శ్రద్ధగా చూస్తున్నట్లు చూపించే కొన్ని వీడియోలు వైరల్ అయ్యాయి.

ఇప్పుడు మొబైల్ చూస్తున్న ఓ కుక్క( Dog ) వీడియో వైరల్ అవుతూ చాలామందిని ఆశ్చర్యపరుస్తుంది.ఆ వీడియోలో ఒక గోల్డెన్ రిట్రీవర్ కుక్కపిల్ల బెడ్‌పై పడుకుని స్మార్ట్‌ఫోన్‌లో షో చూస్తున్నట్లు మనం గమనించవచ్చు.ఇది ఒక మనిషి లాగా పడుకొని, హోల్డర్ లో ఉంచిన మొబైల్ ఫోన్ లోని షో చూస్తూ ఉంది.ఈ పప్పీ( Puppy ) నిజంగానే మొబైల్ షో చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉందా, లేదంటే సరదాగా దాని వైపు చూసిందా అనేది మాత్రం కచ్చితంగా తెలియ రాలేదు.

వీడియో ఎక్కడ షూట్ చేశారు, ఎప్పుడు షూట్ చేశారనే వివరాలు కూడా తెలియ రాలేదు.అయితే, ఈ వీడియో చాలా మందిని ఆకట్టుకుంది.దీనికి ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్‌లో( Instagram ) 1 కోటికి పైగా లైక్స్‌ వచ్చాయి.మనుషుల్లాగానే కుక్కపిల్ల కూడా స్మార్ట్‌ఫోన్‌కి అడిక్ట్ అయిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.మొబైల్ ఫోన్లు మొదట మానవులను, ఇప్పుడు కుక్కలను నాశనం చేస్తున్నాయని సరదాగా ఒకరు కామెంట్ చేశారు.మనిషి పునర్జన్మ ఎత్తి కుక్కపిల్లగా తిరిగి వస్తే ఇలానే జరుగుతుందని మరికొందరు ఫన్నీ కామెంట్లు పెట్టారు.

ఈ కుక్క చాలా లక్కీ అని, దర్జాగా లైఫ్ గడుపుతోందని మరికొందరు అన్నారు.ఆశ్చర్యపరిచే ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.

Video Of Pet Dog Busy Watching Show On …

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube