ఆన్‌లైన్‌లో మేకను ఆర్డర్ చేసిన వ్యక్తి.. చివరి ట్విస్ట్ తెలిస్తే

ఒకప్పుడు ఆన్‌లైన్ షాపింగ్( Online Shopping ) అంటే ప్రజలు భయపడిపోయేవారు కానీ ఇప్పుడు పెద్దగా చదువు రాని వ్యక్తులు కూడా ప్రతిదీ ఆన్‌లైన్‌లోనే షాపింగ్ చేస్తున్నారు.చివరికి జంతువులను( Animals ) కూడా ఇంటర్నెట్‌లో ఆర్డర్ చేసి తెప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నారు.

 Mumbai Man Duped For Rs 93000 After Keeping Goat For An Online Order Details, Mu-TeluguStop.com

తాజాగా ఒక వ్యక్తి కూడా ఒక మేకను( Goat ) ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేశాడు.వినడానికి మనకి వింతగా ఉన్నా సదరు వ్యక్తి డిజిటల్ షాపింగ్‌కి బాగా అలవాటు పడి మేకను కూడా అక్కడే కొనుగోలు చేయొచ్చు అనుకున్నాడు.

కానీ లాస్ట్‌లో ఊహించని ట్విస్ట్‌కు అతడికి ఫ్యూజులు ఎగిరిపోయాయి.

Telugu Duped, Goat, Mumbai, Goat Scam, Rs-Latest News - Telugu

వివరాల్లోకి వెళితే, ముంబైకి( Mumbai ) చెందిన మహ్మద్ ఖురేషి( Mohammed Qureshi ) అనే వ్యక్తికి ఆన్‌లైన్‌లో షాపింగ్ చేయడం అలవాటయింది.అతను పొలం పనులు చేసుకునే ఒక సాదాసీదా రైతు.ఆన్‌లైన్ మోసాల గురించి అతడికి పెద్దగా తెలియనట్లు ఉంది.అందుకే ఓ వెబ్‌సైట్‌లో రూ.86,695కు మేక దొరుకుతుందని చూసి దాన్ని నమ్మేశాడు.మేక ధర రూ.86,695 కాగా ట్రాన్స్‌పోర్ట్ ఖర్చులు రూ.6,600 అవుతాయని, మొత్తంగా చూసుకుంటే రూ.93,295 మేక కోసం చెల్లించాల్సి ఉంటుందని వెబ్‌సైట్ నిర్వాహకులు నమ్మబలికారు.వెబ్‌సైట్ లో మేక చిత్రాలు చూసి అది ఆరోగ్యంగానే ఉందని మహ్మద్ భావించి వెంటనే ఆర్డర్ పెట్టాడు.

Telugu Duped, Goat, Mumbai, Goat Scam, Rs-Latest News - Telugu

అయితే మేకను డెలివర్ చేయాలంటే మొత్తం మనీ అడ్వాన్స్‌గానే కట్టాల్సిందిగా అవతలి వ్యక్తులు ఒక కండిషన్ పెట్టారు.మహ్మద్ ఏ మాత్రం సందేహించకుండా జనవరి 2న రూ.93,295 డబ్బును గూగుల్ పే( Google Pay ) ద్వారా మోసగాళ్లకు పంపించాడు.డబ్బు అందుకున్న తర్వాత ముంబైలోని విక్రోలి జంక్షన్ వద్ద మేకను డెలివరీ చేస్తామని వారు చెప్పేసి ఖురేషి ఫోన్ నంబర్ బ్లాక్ చేశారు.డబ్బులు చెల్లించాక అవతలి వ్యక్తిని కాంటాక్ట్ కావడానికి ఖురేషి ప్రయత్నించాడు కానీ రెస్పాన్స్ రాలేదు దాంతో గుండె పగిలాడు.

దాదాపు లక్ష రూపాయలు మోసపోయాననే చేదు నిజం అప్పటికి గానీ అతడికి బోధపడలేదు.చివరికి చేసేదేమీ లేక పోలీసులకు ఈ విషయమై ఫిర్యాదు చేశాడు.కేసు నమోదు చేసుకున్న ఖాకీలు దర్యాప్తు మొదలుపెట్టారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube