ఏపీలో బడుగు బలహీన వర్గాల పెన్నిధి, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్( Dr.BR Ambedkar ) విగ్రహావిష్కరణ జరిగిన విషయం తెలిసిందే.రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా విజయవాడ నడిబొడ్డున సీఎం వైఎస్ జగన్( CM YS Jagan ) ప్రతిష్టించారు.సుమారు రూ.400 కోట్ల రూపాయలతో ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా విగ్రహాన్ని ఏర్పాటు చేసింది వైసీపీ సర్కార్.బెజవాడలోని బందరు రోడ్డులో ప్రతిమ నగర చరిత్రలోనే మైలురాయిగా నిలిచిందనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.
దాదాపు 85 అడుగుల ఎత్తులో నిర్మించిన కాంక్రీట్ పీఠంపై 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించారు.దీంతో మొత్తం 210 అడుగుల్లో ఈ నిర్మాణం రూపుదిద్దుకుంది.విగ్రహామే కాకుండా చుట్టూ మరెన్నో సదుపాయాలు కల్పించిన వైసీపీ ప్రభుత్వం దీనికి ‘ బీఆర్ అంబేద్కర్ స్వరాజ్ మైదాన్ ’( BR Ambedkar Swaraj Maidan ) గా పేరు పెట్టారు.అంతేకాకుండా 18.81 ఎకరాల్లో స్మృతివనం, కన్వెన్షన్ సెంటర్ ఫుడ్ కోర్టు ఏర్పాటు చేసింది.
విగ్రహావిష్కరణ సభ ఎంతో ఘనంగా జరగగా రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఈ కార్యక్రమానికి తరలివచ్చారు. సీఎం వైఎస్ జగన్ పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించిన ఈ వేడుకను రాష్ట్ర ప్రజలు వీక్షించారు.అయితే ప్రతిపక్షాలు, వాటికి చెందిన కొన్ని మీడియా సంస్థలు ఈ కార్యక్రమంపై కూడా విమర్శలు చేశాయని తెలుస్తోంది.
సీఎం వైఎస్ జగన్ ప్రతిష్టను కించపరుస్తూ తప్పుడు కథనాలను ప్రసారం చేస్తున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.మహానీయ నేతకు గౌరవంగా జరిగిన ఈ కార్యక్రమంపై, దాన్ని నిర్వహించిన వైసీపీ ప్రభుత్వంపై( YCP Govt ) విమర్శలు చేయడంపై దళితులు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.
పెత్తందారీ బుద్దులు మానుకోవాలని హితవు పలుకుతున్నారని తెలుస్తోంది.బడుగు, బలహీన వర్గాలకు పెద్దపీట వేయడమే కాకుండా వారికి అండగా నిలిచిన సీఎం వైఎస్ జగన్ పై విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని చెబుతున్నారని సమాచారం.