రంగారెడ్డి జిల్లా నార్సింగిలో విషాదం చోటు చేసుకుంది.చిన్నారుల మధ్య జరిగిన ఘర్షణలో ఓ బాలుడు ప్రాణాలను కోల్పోయాడు.
ఈ ఘటన అల్కాపూరీ కాలనీలోని మదర్సాలో జరిగింది.తోటి విద్యార్థులు చేసిన దాడిలో తీవ్రంగా గాయపడి మహ్మద్ రకీమ్ అనే బాలుడు కుప్పకూలాడు.
వెంటనే గమనించిన సిబ్బంది బాధిత బాలుడిని హుటాహుటిన గోల్కొండ ఆస్పత్రికి తరలించగా మృతిచెందాడని వైద్యులు తెలిపారు.రాత్రి చిన్న విషయంలో బీహార్ కు చెందిన 12 విద్యార్థులకు, మృతుడు మహ్మద్ రకీమ్ కు మధ్య వివాదం చెలరేగిందని తోటి విద్యార్థులు చెబుతున్నారు.
ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.