ఎంత పెద్ద స్టార్ హీరోలైనా సరే ఒక్కోసారి మూవీ ఈవెంట్స్ లో మాట్లాడేటప్పుడు చాలా ఎమోషన్స్‌కి గురవుతారు.కొన్ని సందర్భాల్లో వారు ఏడ్చేశారు కూడా.
అభిమానుల ముందు మాట్లాడేటప్పుడు వారు తమ జీవితంలో ఎదురైనా కష్టాలను గుర్తు చేసుకుంటారు.వారు మనుషులే కాబట్టి ఎమోషన్స్‌ను దాచుకోలేక కంటతడి పెట్టుకుంటుంటారు.ఆ విధంగా స్టేజి మీద ఏడ్చిన హీరోలు ఎవరో తెలుసుకుందాం.
జూ.ఎన్టీఆర్

అరవింద సమేత వీర రాఘవ షూటింగ్ టైమ్‌లో తారక్ తండ్రి, టాలీవుడ్ హీరో హరికృష్ణ తుది శ్వాస విడిచారు.ఆయన మరణం జూనియర్ ఎన్టీఆర్( Junior NTR )ను ఎంతో బాధించింది.ఆ బాధను దిగమింగుకోలేక “అరవింద సమేత” మూవీ ఈవెంట్‌లో తారక్ దాదాపు ఏడ్చేసాడు.
షారుఖ్ ఖాన్
బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్( Shah Rukh Khan ) 25 ఏళ్ల సినిమా కెరీర్ పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక ఇంటర్వ్యూకి హాజరయ్యాడు.ఆ ఇంటర్వ్యూలో తన జర్నీ గుర్తు చేసుకుంటూ కంటతడి పెట్టుకున్నాడు.
రష్మిక మందన్న

రష్మిక మందన్న “డియర్ కామ్రేడ్” మూవీ ఈవెంట్‌లో సినిమా చేసినప్పుడు తాను ఎన్ని కష్టాలు పడ్డానో గుర్తు చేసుకుంది.ఆ సమయంలో ఆమె కళ్ళలో నీళ్ళు తిరిగాయి.
అల్లు అర్జున్
అల వైకుంఠపురంలో మూవీ ఈవెంట్‌లో బన్నీ తన తండ్రి తన కోసం ఎంతో చేశారని, ఆయనకు ఎన్నిసార్లు థాంక్స్ చెప్పినా తక్కువే అంటూ బాగా ఎమోషనల్ అయ్యాడు.
అనుష్క శెట్టి
అనుష్క శెట్టి “నిశ్శబ్దం” ప్రమోషన్స్‌లో భాగంగా క్యాష్ ప్రోగ్రామ్ వెళ్లి అక్కడ ఎమోషనల్ అయ్యారు.ఎందుకంటే ఈ షోలో ఆమె జర్నీని చాలా ఎమోషనల్‌గా చూపించారు.
సాయి పల్లవి
సాయి పల్లవి “శ్యామ్ సింఘ రాయ్” మూవీ ఈవెంట్‌లో ప్రేక్షకులకు థాంక్స్ చెబుతూ చాలా భావోద్వేగానికి లోనయ్యింది.
మహేష్ బాబు

మహేష్ బాబు “సర్కారు వారి పాట” ఈవెంట్‌లో చనిపోయిన తన అన్నయ్య రమేష్ బాబుని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు.మహేష్ తన తల్లి ఇందిరా దేవి, తండ్రి కృష్ణ చనిపోయిన తర్వాత కూడా కొన్ని మూవీ ఈవెంట్స్ లో వారిని తలుచుకుంటూ బాగా ఫీలయ్యాడు.
బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్( Aishwarya Rai ), రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తదితర నటీనటులు కూడా అభిమానుల ముందు కంటతడి పెట్టుకున్నారు.







