కాంగ్రెస్ నేత చింతా మోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు.మెగాస్టార్ చిరంజీవికి కాంగ్రెస్ లో ఇంకా సభ్యత్వం ఉందని తెలిపారు.
చిరంజీవిని తిరుపతి నుంచి గెలిపించి సీఎంను చేస్తామని చింతా మోహన్ పేర్కొన్నారు.ఇది మంచి సమయం అన్న చింతా మోహన్ నిర్ణయం తీసుకోవాలని చిరంజీవిని కోరుతున్నానని తెలిపారు.
ఏపీలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి ఆదరణ పెరిగిందన్నారు.ఈ క్రమంలోనే బీజేపీపై చంద్రబాబు తన వైఖరి తెలియజేయాలని తెలిపారు.
అలాగే వచ్చే ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీలతో కలిసి ముందుకు వెళ్తామని వెల్లడించారు.