యాదాద్రి భువనగిరి జిల్లా: మోత్కూర్ పరిధిలోని రాజన్నగూడెంలో బుధవారం విషాదం నెలకొంది.లక్ష్మయ్య (68) అనే గీత కార్మికుడు రోజు వారీగా కల్లు గీసేందుకు వెళ్ళి తాటి చెట్టుపైనే గుండెపోటు రావడంతో మృతి చెందాడు.
స్థానిక రైతులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గీత కార్మికుడి డెడ్‌బాడీని తాటి చెట్టుపై నుంచి కిందకు దించారు.లక్ష్మయ్య మృతితో ఆయన కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోగా గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.







