నాలుగు యూఎస్ రాష్ట్రాల్లో మీజిల్స్ హెచ్చరిక.. ఈ అంటు వ్యాధితో చాలా డేంజర్...

మీజిల్స్ లేదా తట్టు అనేది చాలా తీవ్రమైన అంటు వ్యాధి, ఇది తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది.అమెరికాలోని( America ) నాలుగు రాష్ట్రాల్లోని కొంతమందికి ఇతర దేశాలకు వెళ్లిన తర్వాత ఈ తట్టు వ్యాధి వచ్చిందని తాజాగా హెల్త్ అధికారులు కనుగొన్నారు.

 Health Experts Warn About Possible Highly Contagious Measles Outbreak In Usa Det-TeluguStop.com

వ్యాధి మరింతగా వ్యాప్తి చెందకుండా ఆరోగ్యశాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు.మీజిల్స్( Measles ) వచ్చిన వారితో సన్నిహితంగా ఉన్న వారి ఆరోగ్యాన్ని తనిఖీ చేయమని వారు హెచ్చరిస్తున్నారు.మీజిల్స్ కేసులు నమోదైన నాలుగు రాష్ట్రాలు ఏవో చూద్దాం.

• వర్జీనియా

2024, జనవరి 3, 4 తేదీల్లో వర్జీనియాలోని( Virginia ) రెండు విమానాశ్రయాల్లో ఉన్న కొందరు వ్యక్తులు మీజిల్స్‌తో బాధపడుతున్న వారికి దగ్గరగా వెళ్ళినట్టున్నారు.ఆ విమానాశ్రయాలు డల్లెస్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, రోనాల్డ్ రీగన్ వాషింగ్టన్ నేషనల్ ఎయిర్‌పోర్ట్.మీజిల్స్ ఉన్న వ్యక్తితో పాటు అదే విమానాలలో ఉన్న వ్యక్తులను కనుగొని సంప్రదించడానికి హెల్త్ అఫీసియల్స్ ప్రయత్నిస్తున్నారు.

Telugu Dulles Airport, Officials, Highly Measles, Measles, Jersey, Nri, Reagan A

• వాషింగ్టన్ డీసీ

వేరే దేశం నుంచి వచ్చిన వ్యక్తికి తట్టు వచ్చింది.వారు DC ప్రాంతంలోని కొన్ని విమానాశ్రయాల గుండా వెళ్లారు.ఎయిర్‌పోర్టుల్లో( Airports ) ఉన్న ప్రజలకు మీజిల్స్ లక్షణాలు కనిపించకుండా చూడాలని ఆరోగ్య అధికారులు చెబుతున్నారు.మీజిల్స్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉందని, అయితే జాగ్రత్తగా ఉండటం మంచిదని అంటున్నారు.

Telugu Dulles Airport, Officials, Highly Measles, Measles, Jersey, Nri, Reagan A

• పెన్సిల్వేనియా

ఫిలడెల్ఫియాలో( Philadelphia ) ఎనిమిది మందికి తట్టు వచ్చింది.వారు కూడా మరొక దేశానికి ప్రయాణించిన వ్యక్తి నుంచి దీనిని పొందారు.మీజిల్స్ ఉన్న వ్యక్తి ఆసుపత్రి, డేకేర్ సెంటర్‌ను సందర్శించారు.ఆ ప్రదేశాల్లో ఉండి మీజిల్స్‌కు గురైన వ్యక్తుల కోసం ఆరోగ్య అధికారులు వెతుకుతున్నారు.

Telugu Dulles Airport, Officials, Highly Measles, Measles, Jersey, Nri, Reagan A

• న్యూజెర్సీ

న్యూజెర్సీలో( New Jersey ) ఓ వ్యక్తికి తట్టు వచ్చింది.ఇది ఎలా వచ్చిందో వైద్య ఆరోగ్య శాఖాధికారులకు తెలియడం లేదు.పరిస్థితిని నిశితంగా గమనిస్తూ మరిన్ని కేసులు రాకుండా చూసుకుంటున్నారు.

• డెలావేర్

మీజిల్స్ వచ్చిన వ్యక్తి డిసెంబర్ 29న విల్మింగ్టన్‌లోని పిల్లల ఆసుపత్రికి వెళ్లాడు.ఆ వ్యక్తి దగ్గర 20 నుండి 30 మంది వరకు మీజిల్స్ వచ్చి ఉండవచ్చని ఆరోగ్య అధికారులు చెబుతున్నారు.వారి ఆరోగ్యం, టీకా స్థితిని తనిఖీ చేయాలని వారు వారిని కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube