అకీరా లేటెస్ట్ లుక్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) పిల్లలు అకీరా నందన్( Akhira ) ఆద్య( Aadhya ).మెగా సంక్రాంతి సంబరాలలో పాల్గొని సందడి చేసిన విషయం మనకు తెలిసిందే.

 Renudesai Interesting Comments On Akhira And Aadhya Latest Look, Akhira,aadhya,-TeluguStop.com

ఇటీవల కాలంలో మెగా కుటుంబంలో జరిగే వేడుకలకు దూరంగా ఉన్నటువంటి వీరిద్దరూ ప్రస్తుతం మెగా ఫ్యామిలీ మొత్తం కలిసి సంక్రాంతి సంబరాలను బెంగుళూరులో ఫామ్ హౌస్ లో జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ఈ వేడుకలలో పాల్గొనలేకపోయిన తన పిల్లలు ఆఖీరా ఆద్య ఇద్దరు కూడా ఈ వేడుకలలో పాల్గొన్నారు.

అకిరా ఎప్పుడు బయట కనిపించిన మాస్క్ వేసుకొని కనిపిస్తుంటారు.ఆయన పూర్తి లుక్ ఎప్పుడు కూడా బయటపడలేదు.సంక్రాంతి పండుగ సందర్భంగా అకిరా ఆద్య ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అకిరా లుక్ చూసి అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.యంగ్ ఏజ్ లో పవన్ కళ్యాణ్ మాదిరిగానే అఖీరా ఉన్నారు అంటూ పవన్ కళ్యాణ్ ,అకిరా ఫోటోలను పక్కనపెట్టి సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇక తాజాగా ఆధ్య అకిరా ఫోటోలను నటి రేణు దేశాయ్ ( Renu Desai ) సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఆసక్తికరమైనటువంటి విషయాలను వెల్లడించారు.ఈ ఫోటోలకు బ్యాగ్రౌండ్ లో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన అన్నవరం సినిమాలోని అన్నయ్య అన్నావంటే అనే పాటను జత చేశారు.చివరికి వాళ్ల నాన్న సినిమాలోని పాట వీరి రియల్ లైఫ్ లో కనిపిస్తోందంటూ అకిరా ఆద్య బంధం గురించి రేణు దేశాయ్ సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

ఈ మెగా ఫ్యామిలీ సంక్రాంతి సంబరాలలో ఆధ్య అకిరా ఇద్దరు కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారని చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube