టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి( Rajamouli ) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఆయన డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాల కోసం ఇతర భాషల ప్రేక్షకులు సైతం ఒకింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అయితే రాజమౌళికి వ్యక్తిగతంగా హారర్ సినిమాలు( Horror Movies ) అంటే ఇష్టం ఉండదట.అదే సమయంలో లవ్ స్టోరీలు, కామెడీపై జక్కన్నకు పెద్దగా గ్రిప్ లేదట.
అందుకే అలాంటి సినిమాలపై పెద్దగా దృష్టి పెట్టనని జక్కన్న చెబుతున్నారు.
తన డైరెక్షన్ లో తెరకెక్కిన ఈగ సినిమా( Eega Movie ) గురించి రాజమౌళి ఒక సందర్భంలో మాట్లాడుతూ ఈ కామెంట్లు చేశారు.
నాన్న దగ్గర అసిస్టెంట్ గా పని చేసే సమయంలో ఈగ కథ గురించి చెప్పారని అప్పుడు చాలా నవ్వుకున్నామని జక్కన్న పేర్కొన్నారు.ఈగ ఒక సినిమాగా చేయాలని ఎప్పుడూ భావించలేదని రాజమౌళి తెలిపారు.
సింహాద్రి, ఛత్రపతి చేస్తున్న సమయంలో ఒక చిన్న సినిమా చేయాలని ఫీలయ్యనని ఆయన అన్నారు.

మొదట ఈగ సినిమాను 2.5 కోట్ల రూపాయల బడ్జెట్ తో ప్లాన్ చేశామని ఈగ సినిమా మొదలైన తర్వాతే విజువల్ ఎఫెక్ట్స్( Visual Effects ) గురించి తెలిసిందని పేర్కొన్నారు.మొదట ఈగను చూసి గుండె జారిపోయిందని ఆ ఈగ అసహ్యంగా ఉందని ఆయన అన్నారు.
అప్పటికే దాదాపుగా 10 కోట్ల రూపాయలు ఖర్చైందని రాజమౌళి వెల్లడించారు.సీజీ కోసం కాన్సెప్ట్ ఆర్టిస్ట్ లతో స్కెచ్ లు వేయించామని రాజమౌళి తెలిపారు.

ఈగ సినిమా చిన్న సినిమాగా విడుదలై సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది.రాజమౌళి భవిష్యత్తు సినిమా ఈ ఏడాదే మొదలుకానుందని సమాచారం అందుతోంది.జక్కన్న భవిష్యత్తు ప్రాజెక్ట్ లు భారీ లెవెల్ లో ఉండగా మహేష్( Mahesh Babu ) జక్కన్న కాంబో మూవీ ఏ రేంజ్ బడ్జెట్ తో తెరకెక్కుతుందో చూడాల్సి ఉంది.జక్కన్న పారితోషికం ఒకింత భారీ రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది.







