ప్రస్తుతానికి ఐరన్ లెగ్ అనే పదం పై దారుణమైన ట్రోలింగ్ జరుగుతుంది ఒక సినిమా హిట్ వస్తే ఒక లెక్క ఫట్ అయితే మరొక లెక్క.ఏ నటి అయిన ఇండస్ట్రీలో హీరోయిన్ అవ్వాలంటే ఎంతో కష్టపడాలి.
అన్ని రకాల బాధలను అనుభవించాలి చాలా ఇబ్బందులతో వారి కెరియర్ మొదలవుతుంది.ఏదో ఒక అవకాశం వెతుక్కుంటూ రాకపోతుందా అని ఏళ్లకు చూస్తూనే ఉంటారు.
తీరా ఆ అవకాశం వచ్చాక అది పరాజయం పొందితే ఇలాంటి ఒక మార్క్ వస్తే ఎంత దారుణమైన పరిస్థితి ఉంటుందో అర్థం చేసుకోవాలి.హీరోయిన్ అవ్వడం అంటే అవ్వచ్చు కానీ అవ్వడం అనేది కత్తి మీద సాములగానే ఉంది.
ఇటీవల ఈ దోరణి టాలీవుడ్ లో బాగా కనిపిస్తుంది.

తాజాగా కొన్ని కారణాలవల్ల ఇలా పరాజయాలు ఉంది ఇండస్ట్రీ నుంచి మాయం అయిపోతున్న హీరోయిన్స్ గురించి ఈ ఆర్టికల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.మొదటగా ఈ కోవలోకి వచ్చిన హీరోయిన్ పూజ హెగ్డే.మొదట్లో హ్యాట్రిక్ హిట్స్ అందుకుని వరుసగా సినిమాల్లో నటించిన ఆ తర్వాత కొన్ని చిత్రాలు ఫ్లాప్ అవుతూ రావడంతో ఆమెను అందరూ ఐరన్ లెగ్ అని సినిమాల నుంచి తీసివేశారు కొన్ని సినిమాలకు అడ్వాన్సులు కూడా వెనక్కి ఇచ్చింది.

ఇక కీర్తి సురేష్( Keerthy Suresh ) గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.ఆమె దాదాపు మహానటి చిత్రం తర్వాత పదికి పైగా సినిమాలు పరాజయం పాలయ్యాయి.దాంతో సర్కారు వారి పాట( Sarkaru Vaari Paata ) చిత్రంతో తిరిగి విజయాన్ని అందుకొని ప్రస్తుతం సినిమాలైతే చేస్తుంది కానీ ఆమెకు తెలుగులో మాత్రం ఎవ్వరు అవకాశాలు ఇవ్వడం లేదు.

క్రితిశెట్టి( Krithi Shetty ) కూడా ఈకోవలోకి వస్తుంది ఆమె హ్యాట్రిక్ సినిమాల్లో విజయం సాధించాయి ఆ తర్వాత వరుసగా పరాజయాలు పలకరించడంతో ఆమెను ఐరన్ లెగ్ అనే టాగ్ వేసి సినిమా ఇండస్ట్రీ నుంచి మాయమైపోయేలా చేశారు.ఇప్పుడు శ్రీ లీల( Sreeleela ) బతుకు వచ్చింది ఆమె కూడా ధమాకా సినిమాతో విజయాన్ని అందుకుని ఆ తర్వాత అన్ని వరుస పెట్టి బ్లాక్ చిత్రాలు తీస్తుంది దాంతో ప్రస్తుతం లేటెస్ట్ టాలీవుడ్ ఐరన్ లెగ్ అనే పిలుపు ఆమెకే దక్కింది.ఇక ఈ టాగ్ కోసం నెక్స్ట్ లైన్ లో ఉన్న హీరోయిన్ ఎవరో తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాలి.








