భోగి పండుగ రోజున భోగి మంటలు( bonfires ) వేస్తారు.అయితే ఇంట్లోని పాత వస్తువులను కాల్చుతారు.
అలాగే సంక్రాంతి పండుగ భోగి పండుగ ( Bhogi festival ) తోనే మొదలవుతుంది.కనుమతో ముగుస్తుంది.
జనవరి 14న భోగి రోజున భోగిమంటల్లో ఇంట్లో పాత వస్తువులను వేస్తాం.దీంతో పాత బాధలు తొలగిపోతాయి.
కొత్తగా ఆనందం రావాలని అందరూ కోరుకుంటూ ఉంటారు.అదేవిధంగా మనసులోని చెడు ఆలోచనలు, జ్ఞాపకాలను మర్చిపోయి, కొత్త ఆరోగ్యకరమైన ఆలోచనలతో జీవితాన్ని గడపాలని భోగి పండుగ సూచిస్తుంది.
అయితే భోగి మంటల చుట్టూ ప్రజలు గుమిగూడి పాటలు పాడుతూ ఉంటారు.అయితే మంటల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి.

అగ్నికి చాలా దగ్గరగా నిలవడం వలన ప్రమాదకరం, హానికరం.భోగి పండుగ సమయంలో అగ్ని ప్రమాదాల గురించి తెలుసుకోవాలి.భోగి పండుగ సందర్భంగా చాలామంది పూజ మంటల చుట్టూ చేరుకుంటారు.అయితే మీరు అగ్నికి చాలా దగ్గరగా ఉంటే మీ చర్మం, మొటిమలు, మచ్చలు, నల్లగా మారుతుంది.
అలాగే అగ్ని ద్వారా బొబ్బలు కూడా రావచ్చు.మీరు చర్మ అసౌకర్యాన్ని కూడా అనుభవించవచ్చు.
భోగి మంటలు కాల్చినప్పుడు మీ చర్మం కాలిపోకుండా ఉండడానికి మీరు దూరంలో నిలబడి ఉండేలా చూసుకోవాలి.కట్టెల నుండి వచ్చే పొగ మీకు ఆరోగ్య సమస్యలను( Health problems ) కలిగిస్తుంది.
ఇది గుండె జబ్బులు, ఆస్తమా, దగ్గు తో ముడిపడి ఉంటుంది.

ఈ ప్రమాదకరమైన ప్రభావాలతో పాటు మీ ఊపిరితిత్తులకు కూడా హాని కలుగుతుంది.అలాగే ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది.భోగిమంటల సమయంలోనే కాకుండా శీతాకాలం అంతా కూడా మంటలకు దగ్గరగా నిలబడడం, కూర్చోవడం మానుకోవాలి.
మంటలు దగ్గరకు వెళ్లడం ప్రత్యేకంగా అస్సలు చేయకూడదు.ఎందుకంటే ఇది మీ శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది.
దీంతో శ్వాస ఆడకపోవడానికి కలిగిస్తుంది.వివిధ చర్మ సమస్యలు కూడా వస్తాయి.
అంతేకాకుండా అలసట, బలహీనత లాంటి లక్షణాలు కూడా కలగవచ్చు.అంతేకాకుండా హీట్ స్ట్రోక్ కూడా రావచ్చు.
కాబట్టి భోగి మంటల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి.







