సమంతకు పువ్వులంటే అస్సలు పడదా... భయమంటున్న నటి!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి సక్సెస్ అయినటువంటి వారిలో నటి సమంత (Samantha) ఒకరు.హీరోయిన్గా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నటువంటి సమంత అనారోగ్య సమస్యల కారణంగా ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.

 Samanth Post A Photo With Flower Bouquet Details,samantha,flower Bouquet, Allerg-TeluguStop.com

ఇలా సినిమాలకు దూరంగా ఉన్నటువంటి ఈమె పూర్తిగా తన ఆరోగ్యం పై దృష్టి పెట్టి తన ఆరోగ్యాన్ని కాపాడుకునే పనులలో బిజీగా ఉన్నారు.ఇక సమంత సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు.

ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకునే సమంత తాజాగా ఒక ఫ్లవర్ బొకే (Flower Bouquet) తో ఉన్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు.ఇక ఈ ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఈమె.ఇలాంటివి చూసినప్పుడు మిక్స్‌డ్ ఫీలింగ్స్ కలుగుతాయి.ఎందుకంటే లాస్ట్ టైం వీటివల్లే నేను ఎమర్జెన్సీ రూమ్ కి వెళ్లాల్సి వచ్చింది.

ఎవరికి పూలంటే ఎలర్జీ ఉంది అని పోస్ట్ చేశారు.ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక ఈ ఫోటో చూసినటువంటి ఎంతోమంది అభిమానులు సమంతకు పువ్వులు( Flowers ) అంటే పడదా అందుకే ఈమె పువ్వులను చూస్తే ఇంత భయపడతారా అంటూ వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.అయితే శాకుంతలం సినిమా( Shaakuntalam ) సమయంలో కూడా ఎక్కువగా పువ్వులను పెట్టుకోవడం వల్ల తనకు స్కిన్ పై భారీగా అలర్జీ వచ్చిందనే విషయాన్ని సమంత ప్రమోషన్ కార్యక్రమాలలో వెల్లడించిన సంగతి తెలిసిందే.మొత్తానికి పువ్వులంటే సమంత ఆమడ దూరంలో ఉంటారని ఈ సందర్భంగా వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube