వైసీపీ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ టికెట్ వ్యవహారం కొలిక్కి వచ్చిందని తెలుస్తోంది.సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో పలు దఫాలుగా అధిష్టాన పెద్దలు జరిపిన చర్చలు సఫలం అయ్యాయని సమాచారం.
ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ ఇస్తామన్న అధిష్టానం హామీకి మల్లాది విష్ణు ఓకే చెప్పారు.కాగా మల్లాది విష్ణు స్థానంలో విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ను పార్టీ హైకమాండ్ ఇంఛార్జ్ గా నియమించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో వెల్లంపల్లితో కలిసి సెంట్రల్ నియోజకవర్గంలో ఎన్నికలకు సిద్ధం కావాలని మల్లాది విష్ణును అధిష్టానం ఆదేశించింది.దీంతో అసంతృప్తిగా ఉన్న మల్లాది విష్ణు అలకను వీడారని సమాచారం.
దీంతో రానున్న ఒకటి రెండు రోజుల్లో వెల్లంపల్లి, మల్లాది విష్ణు కలిసి ఉమ్మడి ప్రకటన చేసే అవకాశం ఉంది.







