సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవిపై( Megastar Chiranjeevi ) చింతామోహన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.చిరంజీవి కాంగ్రెస్ తరపున తిరుపతిలో పోటీ చేయాలని అభిప్రాయం వ్యక్తం చేశారు.
చిరంజీవి పోటీ చేస్తే యాభైవేల మెజార్టీతో గెలిపిస్తామని చింతా మోహన్ తెలిపారు.చిరంజీవి తిరుపతి నుంచి పోటీ చేస్తే ముఖ్యమంత్రి కావడం ఖాయమని పేర్కొన్నారు.
అయితే పోటీ చేస్తారో లేదో నిర్ణయం తీసుకోవాల్సింది చిరంజీవేనని వెల్లడించారు.ఈ క్రమంలోనే ఏపీలో ఇండియా కూటమిలోని అన్ని పార్టీలతో కలిసి పోటీ చేస్తామని తెలిపారు.
నగరి నుంచి సీపీఐ నారాయణ, కాకినాడ లోక్ సభ నుంచి ఏచూరి పోటీ చేయాలని కోరారు.







