టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ సీఐడీ కార్యాలయాలకు వెళ్లనున్నారు.విజయవాడతో పాటు తాడేపల్లి, గుంటూరు సీఐడీ కార్యాలయాలకు చంద్రబాబు వెళ్లనున్నారు.
సీఐడీ కార్యాలయాల్లో చంద్రబాబు పూచీకత్తు సమర్పించనున్నారు.ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుతో పాటు మద్యం కేసు, అక్రమ ఇసుక కేసులో చంద్రబాబుకు న్యాయస్థానం షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో హైకోర్టు ఆదేశాల మేరకు ఆయన ఇవాళ సీఐడీ కార్యాలయాలకు వెళ్లి ఇద్దరు పూచీకత్తుతో పాటు రూ.లక్ష విలువ గల బాంబ్ ను సమర్పించనున్నారు.







