టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్( Prabhas ) గురించి మనందరికీ తెలిసిందే.ప్రభాస్ ఇటీవల సలార్ సినిమాతో ప్రేక్షకులను పలకరించారు.
ఈ సినిమాతో మరో సూపర్ హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకున్నారు డార్లింగ్ ప్రభాస్.ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ను ఎంజాయ్ చేస్తూనే తదుపరి సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు చాలారోజుల తర్వాత బయట కనిపించాడు.
అది కూడా ఒక గుడిలో ( Temple ) స్పెషల్ పూజలు చేస్తూ దర్శనమిచ్చాడు.దాంతో ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇంతకీ ప్రభాస్ ఎక్కడ పూజలు చేశాడు దాని వెనుక ఉన్న కారణం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.హీరో ప్రభాస్ 20 రోజుల ముందు సలార్ సినిమాతో( Salaar Movie )థియేటర్లలోకి వచ్చాడు.హిట్ కొట్టాడు.అయితే ప్రమోషన్ కూడా ఒక్క ఇంటర్వ్యూతో సరిపెట్టేశారు.ఇది తప్పితే ప్రభాస్ పెద్దగా కనిపించలేదు.మధ్యలో సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు కానీ ఒకటో రెండో ప్రభాస్ ఫొటోలు బయటకొచ్చేసరికి ఫ్యాన్స్ తెగ ఆనందపడిపోయారు.
తాజాగా సలార్ గ్రాండ్ సెలబ్రేషన్స్ ఏర్పాటు చేశారు.శుక్రవారం రాత్రే ఇది జరగనుంది.

ఈ క్రమంలోనే కర్ణాటక వెళ్లిన ప్రభాస్ మంగళూరు లోని శ్రీ దుర్గా పరమేశ్వరి ఆలయానికి( Sri Durga Parameshwari Temple ) వెళ్లారు.వైట్ క్యాప్, మాస్క్ ధరించిన ప్రభాస్.సలార్ ప్రొడ్యూసర్ విజయ్ కిరగందూర్‌తో( Vijay Kiragandur ) కలిసి గుడికి వెళ్లారు.స్పెషల్ పూజాలు కూడా చేయించాడు.అయితే సలార్ సినిమా సక్సెస్ అయిన సందర్భంగా ఈ పూజలు చేయించినట్లు తెలుస్తోంది.ఆ ఫోటోలను చూసిన ప్రభాస్ అభిమానులు వాటిని సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.
ఇకపోతే ప్రభాస్ ప్రస్తుతం కల్కి సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.ఈ సినిమాను 2024 మే 9న విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే చిత్ర బృందం అధికారికంగా ప్రకటించారు.







