సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) తాజాగా గుంటూరు కారం (Gunturu Kaaram) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా ద్వారా మహేష్ బాబు మరో సక్సెస్ అందుకున్నారు.
త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) డైరెక్షన్లో ముచ్చటగా మూడోసారి మహేష్ బాబు నటించిన ఈ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.మహేష్ బాబు శ్రీ లీల( Sreeleela ) మీనాక్షి చౌదరి ( Meenakshi Chowdary ) హీరో హీరోయిన్లు ఈ సినిమా అభిమానులను సందడి చేస్తోంది.
ఇక ఈ సినిమాని హారిక హాసిని బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.

ఇక ఈ సినిమా మొదటి షో నుంచి మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది .ఇకపోతే ఈ సినిమా కోసం మహేష్ బాబు ఎంత మొత్తంలో రెమ్యూనరేషన్ ( Remuneration ) తీసుకున్నారనే విషయం గురించి వార్తలు వైరల్ అవుతున్నాయి.సాధారణంగా మహేష్ బాబు ఒక్కో సినిమాకు 70 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటారని తెలుస్తుంది కానీ గుంటూరు కారం సినిమాకు మాత్రం 50 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ అందుకున్నారని సమాచారం.
ఇలా ఈ సినిమా కోసం మహేష్ బాబు తన రెమ్యూనరేషన్ తగ్గించుకోవడానికి గల కారణం ఏంటి అంటూ అందరూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

మహేష్ బాబు ఈ సినిమా కోసం తక్కువ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకోవడానికి కారణం లేకపోలేదు.ఈ సినిమా త్రివిక్రమ్ డైరెక్షన్లో రావడమే అందుకు కారణం అని తెలుస్తుంది.ఇక ఈ సినిమాకు త్రివిక్రమ్ దర్శకత్వం వహించడమే కాకుండా సొంత బ్యానర్ పై ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు.
అందుకే తన రెమ్యూనరేషన్ తగ్గించుకున్నారని అంటున్నారు.ఏదీ ఏమై త్రివిక్రమ్ కోసం మహేష్ ఇంత పెద్ద సాహసం చేశారు అంటూ పలువురు మహేష్ రెమ్యూనరేషన్ గురించి కామెంట్స్ చేస్తున్నారు.







