ఆ విషయంలో శ్రీలీలను మెచ్చుకోవాల్సిందే.. అలాంటి చెత్త ఆఫర్లకు నో చెప్పేసిందా?

ప్రస్తుత కాలంలో చాలామంది డబ్బే లోకంగా, డబ్బే సర్వస్వంగా భావిస్తున్నారు.స్టార్ హీరోయిన్లలో చాలామంది ఇదే రూల్ ను ఫాలో అవుతున్నారనే సంగతి తెలిసిందే.

 Heroine Sreeleela Strange Decision Details, Sreeleela, Sreeleela Great Decision,-TeluguStop.com

అయితే శ్రీలీల( Sreeleela ) మాత్రం ఆయా హీరోయిన్లకు భిన్నంగా నిలుస్తున్నారు.ప్రస్తుతం శ్రీలీల పారితోషికం 3 నుంచి 4 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది.

శ్రీలీల ప్రముఖ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా( Brand Ambassador ) వ్యవహరిస్తున్నారు.

అయితే బెట్టింగ్ యాప్ లకు, మద్యం బ్రాండ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించే ఆఫర్ శ్రీలీలకు రాగా ఆమె సున్నితంగా ఆ ఆఫర్లకు నో చెప్పిందని సమాచారం అందుతోంది.

శ్రీలీల ఇలాంటి రూల్స్ ను పెట్టుకుంటూ కెరీర్ పరంగా ఒక్కో మెట్టు ఎదగడం ద్వారా ఊహించని స్థాయిలో ప్రశంసలు అందుకుంటున్నారు.గుంటూరు కారం సినిమాతో( Guntur Karam Movie ) శ్రీలీలకు మంచి పేరు రావాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

Telugu Alcohol Brands, Apps, Ambassador, Extra Ordinary, Guntur Karam, Sreeleela

శ్రీలీల భవిష్యత్తులో సైతం ఇవే నిబంధనలను ఫాలో కావాలని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.మంచి ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే శ్రీలీలకు కెరీర్ పరంగా తిరుగుండదని కామెంట్లు వినిపిస్తున్నాయి.శ్రీలీల త్వరలో మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్ లలో నటించనున్నారని సమాచారం అందుతోంది.ఇతర భాషల నుంచి ఆఫర్లు వస్తున్నా శ్రీలీల మాత్రం తెలుగుకే ప్రాధాన్యత ఇస్తున్నారు.

Telugu Alcohol Brands, Apps, Ambassador, Extra Ordinary, Guntur Karam, Sreeleela

నితిన్, శ్రీలీల కాంబోలో ఇప్పటికే తెరకెక్కి విడుదలైన ఎక్స్ట్రార్డినరీ మ్యాన్ మూవీ( Extra Ordinary Man Movie ) ప్రేక్షకులను మెప్పించలేదు.అయితే నితిన్, శ్రీలీల కాంబోలో మరో సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం.వెంకీ కుడుముల డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.శ్రీలీల రాబోయే రోజుల్లో కెరీర్ పరంగా మరిన్ని సంచలనాలను సృష్టిస్తారేమో చూడాల్సి ఉంది.

జాగ్రత్తగా అడుగులు వేస్తే స్టార్ హీరోయిన్ శ్రీలీల కెరీర్ కు బెనిఫిట్ కలుగుతుందని చెప్పవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube