యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష రాసి ఆ పరీక్షలో మంచి మార్కులు సాధించి ఐపీఎస్( IPS ) కావడం సులువైన విషయం కాదు.రేయింబవళ్లు కష్టపడితే మాత్రమే సక్సెస్ సొంతమయ్యే అవకాశాలు అయితే ఉంటాయి.
యూపీఎస్సీ సివిల్స్ తొలి ప్రయత్నంలో ఆశించిన ఫలితం రాకపోయినా రెండో ప్రయత్నంలో కష్టపడి అభిషేక్ సింగ్( Abhishek Singh ) సక్సెస్ ను సొంతం చేసుకున్నారు.బ్యాంక్ మేనేజర్ జాబ్ కు రిజైన్ చేసి మరీ అభిషేక్ సింగ్ లక్ష్యాన్ని సాధించడం ద్వారా వార్తల్లో నిలిచారు.

యూపీలోని( Uttar Pradesh ) కౌశాంబి జిల్లాలోని తహసీల్ ప్రాంతంలో ఉన్న రతన్ పురకు చెందిన అభిషేక్ సింగ్ కు ఎస్బీఐ( SBI ) బెంగళూరు బ్రాంచ్ లో జాబ్ వచ్చింది.ఎవర్ గ్రీన్ పబ్లిక్ స్కూల్ లో ప్రాథమిక విద్యను అభ్యసించిన అభిషేక్ సింగ్ లక్నోలోని ప్రముఖ కాలేజ్ నుంచి ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేశారు.బీటెక్ తర్వాత ఎస్బీఐలో పీవోగా ఎంపికైన అభిషేక్ సింగ్ సివిల్స్ కోసం మొదట బ్యాంక్ జాబ్( Bank Job ) నుంచి ఆరు నెలలు సెలవు తీసుకున్నాడు.

తర్వాత రోజుల్లో బ్యాంక్ జాబ్ కు రిజైన్ చేసి ప్రిపేర్ అయ్యాడు.ఉద్యోగాన్ని వదిలేయాలని అభిషేక్ సింగ్ తీసుకున్న నిర్ణయాన్ని కుటుంబ సభ్యులలో చాలామంది వ్యతిరేకించారు.అయితే అభిషేక్ మాత్రం కుటుంబ సభ్యులను ఒప్పించి ముందడుగులు వేశారు.
అభిషేక్ సింగ్ ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించడంతో కుటుంబ సభ్యుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.

అభిషేక్ కు చిన్నప్పటి నుంచి అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ లో ( Administrative Service ) చేరాలనే కల ఉండేదని సమాచారం అందుతోంది.రోజుకు 16 గంటల పాటు చదివేవాడినని అంత కష్టపడి చదవడం వల్లే నా కల నెరవేరిందని అభిషేక్ సింగ్ అన్నారు.అభిషేక్ సింగ్ చెప్పిన విషయాలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి.








